హైదరాబాద్ : (ధర్మఘంట ) ట్రూ న్యూస్... తెలంగాణ లో ఫార్ములా ఈ-రేస్ కేసు హాట్ టాపిక్‌గా మారుతోంది. ఓవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ఈడీ అధికారులు.. మరోవైపు ఏసీబీ అధికారులు ఈ కేసులో దర్యాప్తు జరుపుతున్నారు. ఈ వ్యవహారంలో తనపై దాఖలైన కేసును కొట్టేయాలని కేటీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. ఇవాళ ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. కేటీఆర్‌ను అరెస్ట్ చేయకుండా ఇప్పటికే ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఈ సందర్భంగా హైకోర్టు వెనక్కి తీసుకుంది. ఈ క్రమంలోనే ఓ వైపు ఏసీబీ, ఈడీ దర్యాప్తులు.. మరోవైపు కోర్టు ఎదురుదెబ్బ నేపథ్యంలో కేటీఆర్ చేసి ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.రాష్ట్రంలో ఫార్ములా ఈ-రేస్ కేసు సంచలనం రేపుతున్న వేళ.. కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు. నా మాటలు గుర్తు పెట్టుకోండి. మాకు తగిలిన ఎదురుదెబ్బ కంటే మేం తిరిగి పుంజుకోవడం మరింత బలంగా ఉంటుంది. మీ అబద్ధాలు నన్ను విచ్ఛిన్నం చేయవు. మీ మాటలు నన్ను తగ్గించవు. మీరు చేసే పనులు నా విజన్‌ను మార్చలేవు. ఇలాంటివి నేను నిశ్శబ్దంగా ఉండేలా చేయవు. నేటి అడ్డంకులు రేపటి విజయానికి దారి తీస్తాయి. కాలంతోపాటు నిజం బయటికి వస్తుంది. మన న్యాయవ్యవస్థను నేను గౌరవిస్తాను. న్యాయం గెలుస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. సత్యం కోసం నా పోరాటం కొనసాగుతుంది. త్వరలోనే నా పోరాటానికి ప్రపంచం కూడా సాక్ష్యంగా ఉంటుంది’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు. నా మాటలు గుర్తు పెట్టుకోండి