వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతితో కలిసి ఇవాళ లండన్ వెళ్లనున్నారు..
ఈ రోజు ఉదయం బెంగళూరు నుంచి లండన్ బయల్దేరనున్నారు.. ఈ నెల 16వ తేదీన జగన్ దంపతుల చిన్న కూతురు వర్ష కాన్వకేషన్ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో.. మరోసారి లండన్‌కు పయనం అయ్యారు జగన్ దంపతులు.. ఇక, ఈ నెల 30 లోపు తిరిగి స్వరాష్ట్రానికి చేరుకోనున్నట్టుగా తెలుస్తోంది.. కాగా, లండన్ వెళ్లేందుకు వైఎస్ జగన్‌కు సీబీఐ కోర్టు అనుమతిచ్చిన విషయం విదితమే.. ఈ నెల 11వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జగన్ యూకే వెళ్లేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఆస్తుల కేసులో బెయిల్ మంజూరు చేసిన సమయంలో అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదనే షరతు కోర్టు విధించిన నేపథ్యంలో.. తన కూతురు గ్రాడ్యుయేషన్ డే కోసం లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు జగన్.. దీంతో.. జగన్ లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే..