స్వామి వివేకానంద 1863 జనవరి 12న కలకత్తాలో (ప్రస్తుతం కోల్‌కతా) జన్మించారు. స్వామి వివేకానంద (Swami Vivekananda) చిన్ననాటి పేరు నరేంద్ర నాథ్ దత్. చిన్నతనం నుంచి ఆధ్యాత్మికతపై మక్కువ. 1881లో వివేకానంద రామకృష్ణ పరమహంసను కలుసుకున్నారు. ఆయన వివేకానందుని గురువు అయ్యారు. తన గురువు రామకృష్ణ ప్రభావంతో 25 ఏళ్ల వయసులో సన్యాసం తీసుకున్నారు. ఆ తరువాత ఆయన పేరు స్వామి వివేకానందగా మార్చుకున్నారు. రామకృష్ణ పరమహంస 1886లో మరణించారు. స్వామి వివేకానంద 1897లో కోల్‌కతాలో రామకృష్ణ మిషన్‌ను స్థాపించారు. ఒక ఏడాది తరువాత ఆయన గంగా నది ఒడ్డున బేలూరులో రామకృష్ణ మఠాన్ని స్థాపించారు. వివేకానంద తన 39వ ఏట 1902 జూలై 04న బేలూరు మఠంలో మరణించారు.
హైదరాబాద్: (ధర్మఘుంట) : ట్రూ న్యూస్
భారతదేశాన్ని జాగృతము చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండులలో యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయము చేసిన ఖ్యాతి అతనికి ఉంది. గురువు గారి కోరిక మేరకు అమేరికా వెళ్ళి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడు. భారతదేశాన్ని ప్రేమించి, భారతదేశం మళ్ళీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానంద. అతని వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరథం పట్టింది. ఎంతో మంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి ఈయనే. తూర్పు దేశాల తత్త్వమును షికాగోలో జరిగిన ప్రపంచ మత జాతర (పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రెలిజియన్స్) లో 1893 లో ప్రవేశపెట్టాడు. అక్కడే షికాగో లోను, అమెరికా లోను, ఇతర ప్రాంతాలలోను ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. తిరిగి భారతదేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశాడు. ముప్ఫై తొమ్మిది ఏళ్ళ వయసు లోనే మరణించాడు. అతను చేసిన సేవలకు గుర్తింపుగా 1984 లో భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని "జాతీయ యువజన దినోత్సవం"గా ప్రకటించింది నరేంద్ర నాథుడు బాల్యం అంతా కలకత్తా, బెంగాలు ప్రెసిడెన్సీ, బ్రిటీష్ పరిపాలనలోని భారతదేశం (ఇప్పుడు కోల్కతా, పశ్చిమ బెంగాల్, భారత దేశం) లో ఒక ఉన్నత కుటుంబంలో జన్మించాడు. వివేకానందుడు చిన్నప్పటి నుంచే రోజూ ధ్యానం చేసేవాడు. బాలుడిగా ఉన్నపుడు నరేంద్రుడు చాలా ఉల్లాసంగా, చిలిపిగా ఉండేవాడు. సన్యాసుల పట్ల యోగుల పట్ల అమితమైన ప్రేమను కనబరిచేవాడు. వారు ఏదడిగినా సరే లేదనకుండా ఇచ్చేసేవాడు. పుట్టగానే పువ్వు పరిమళిస్తుందన్నట్లుగా చిన్నప్పటి నుంచే అతనికి నిస్వార్థ గుణం, ఔదార్య గుణాలు అలవడ్డాయి. నమా హామీరేంద్రుడు ఆటలలోనూ, చదువులో కూడా ముందుండేవాడు. ఏకసంథాగ్రాహి. పాఠాన్ని ఒకసారి చదివితే మొత్తం గుర్తుంచుకునేవాడు. అతని జ్ఞాపకశక్తి అమోఘమైనది. 1880 వరకు మెట్రిక్యులేషన్ పరీక్ష, ప్రవేశ పరీక్ష ఉత్తీర్ణుడై కళాశాలలో చేరాడు. రోజు రోజుకూ అతని జ్ఞాన తృష్ణ అధికంకాసాగింది. దైవం గురించి తెలుసుకోవాలని పరమ ఆసక్తితో ఉండేవాడు. చరిత్ర, సైన్సుతోపాటు పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని కూడా ఔపోసన పట్టాడు. అలా చదువులో ముందుకెళుతున్న కొద్దీ అతని మదిలో అనుమానాలు, సందేహాలు, అస్పష్టత ఎక్కువ కాసాగినాయి. అలా మూఢ నమ్మకాలన్నింటినీ విడిచిపెట్టినప్పటికీ సత్యాన్ని మాత్రం కనుగొనలేకపోయాడు. నరేంద్రుడు తనకు వచ్చిన సందేహాలన్నీ అనేక పండితుల ముందు వెలిబుచ్చాడు. వారంతా వాదనలలో ఆరితేరిన వారు. కానీ వారి వాదనలేవీ నరేంద్రుడిని సంతృప్తి పరచలేకపోయాయి. వారు ఆలోచిస్తున్న మార్గం కూడా వివేకానందుడికి నచ్చలేదు. అందునా వారెవరికీ భగవంతునితో ప్రత్యక్ష అనుభవం లేదు.