వైయస్, అభిషేక్ రెడ్డి మ్రృతి


 


 హైదరాబాద్:(ధర్మఘంట ) : ట్రూ న్యూస్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్యంతో జగన్ సోదరుడు వైఎస్ అభిషేక్ రెడ్డి కన్నుమూశారు.ఆయన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో అభిషేక్ రెడ్డి మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. అభిషేక్ రెడ్డి మృతిపై వైసీపీ శ్రేణులు శోక సంద్రంలో మునిగిపోయారు.ఆయన మృతిపై వైసీపీ నేతలు నివాళులు అర్పిస్తున్నారు. అభిషేక్‌రెడ్డి పార్థివదేహాన్ని హైదరాబాద్‌ నుంచి పులివెందులకు తీసుకెళ్తున్నారు. రేపు(శనివారం) ఉదయం అభిషేక్‌రెడ్డికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియల్లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, ఆయన భార్య భారతి పాల్గొననున్నారు. కాగా పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు ఆయన మృతదేహానికి నివాళలులు అర్పిస్తున్నారు. పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ రవి, మరి కొందరు ఎమ్మె ల్యేలు నివాళులు అర్పించారు. అభిషేక్ రెడ్డి మృతితో పులివెందులలో విషాద చాయలు అలుముకున్నాయి.