భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టీ20లో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఒక లంక బౌలర్ డిఫరెంట్ బౌలింగ్‌తో హైలైట్‌గా నిలిచాడు. సాధారణంగా ఏ బౌలర్ అయినా కుడి చేతితో బౌలింగ్ చేస్తారు లేదా ఎడమ చేతితో బౌలింగ్ చేస్తారు.
సాధారణంగా కుడి చేతి వాటం బ్యాటర్లను ఎడమ చేతి స్పిన్నర్లు ఇబ్బంది పెడుతుంటారు. అదే సమయంలో ఎడమ చేతి బ్యాటర్లను కుడి చేతి వాటం బౌలర్లు చికాకు పెడతారు. అందుకే సూర్య కోసం లెఫ్టాండ్‌తో బౌలింగ్ చేస్తూ బంతుల్ని బయటకు తీసుకెళ్లిన మెండిస్.. పంత్‌కు కూడా అలాగే బౌలింగ్ చేసి ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించాడు. కమిందు బౌలింగ్ చూసిన నెటిజన్స్ ఇలా రెండు చేతులతో బౌలింగ్ చేయడం కరెక్టేనా అని అనుమానిస్తున్నారు. ఐసీసీ రూల్స్ ప్రకారం చూసుకుంటే ఇది సరైనదే. నిబంధనల ప్రకారం బౌలర్ ఏ చేతితోనైనా బౌలింగ్ చేయొచ్చు, ఇందులో తప్పేమీ లేదు. అయితే బంతి వేసే ముందు అంపైర్‌కు సమాచారం ఇవ్వాలి. అప్పుడు ఈ విషయం బ్యాటర్‌కు చెబుతాడు అంపైర్. ఇలా బౌలింగ్ చేసే టాలెంట్ చాలా అరుదు.