ఎస్సీ, ఎస్టే ఉపాద్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంపెల్లి భిక్షపతి డిమాండ్
మరోసారి కార్యవర్గ ఎంపిక ఏకగ్రీవం
కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఫుడ్స్ చైర్మన్, మేడే రాజీవ్ సాగర్ వివాహ దినోత్సవ వేడుక
ఉపాద్యాయ బదిలీలు, పదోన్నతులు వెంటనే చేపట్టాలని ఎస్సీ, ఎస్టే ఉపాద్యాయ సంఘం రాస్త్ర అధ్యక్షులు కొంపెల్లి భిక్షపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు (సోమవారం) హైదరాబాద్, మింట్ కాంపౌండ్ లోని బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తి భవన్ లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షునిగా మరోసారి ఏకగ్రీవంగా ఎంపికై ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మాట్లాడుతూ విద్య లౌకికవాదాన్ని బలపరుస్తుందని, లౌకికవాదంతో విద్యను విస్తరించి, సామ్రాజ్యవాదానికి, మతతత్వానికి వ్యతిరేకమైన లౌకికవాదం పెంచేవిధంగా, ప్రగతిశీల భావాలు లేకుండా మూఢత్వం, ధార్మిక వాదనలను బలపరిచే విధంగా ఉపాద్యాయులే చూడాలని, పిల్లల భవిష్యత్ రాజకీయాలే అవునన్నా కాదన్నా నిర్ణయిస్తాయని. అటువంటి రాజకీయ విధానాల మంచి, చెడులలో మేధావుల జోక్యం పెరగాలని సూచిస్తూ, ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్య అందించాలనే సంక్పలంతోనే ఉపాధ్యాయులు పనిచేయాలని, తద్వారా ప్రభుత్వం స్పందించి, వెంటనే ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని, పీఆర్సీని సకాలంలో నియమించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా యానం విజయ్ కుమార్, రాష్ట్ర కోశాధికారిగా ఆర్ కృష్ణ నాయక్, రాష్ట్ర మహిళాధ్యక్షురాలుగా కొంకల శరత్ యామిని ఏకగ్రీవంగా ఎంపికైనారు. మాతంగి ప్రభాకర్ రావు, లఛ్చిరాం నాయక్ ఎన్నికల అధికారులుగా వ్యవహరించగా, మేడి రామకృష్ణ, బొడ్డు హుస్సేన్, సుశీల్ కుమార్, గోలి లింగయ్య, దున్న నాగేశ్వర్ రావు, పాల్వాయి వెంకటేశ్వర్లు, ఈ రాష్ట్ర కార్యవర్గంలో నియమించబడ్డారు. ఈ కార్యక్రమంలో రాములు బోయ, బొజ్జన్న, నామ నాగయ్య, తుకారాం, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఫుడ్స్ చైర్మన్, తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షులు మేడే రాజీవ్ సాగర్ వివాహ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని, కేకును కట్చేసి, సంబరాలు నిర్వహించి, ఈ వేడిక ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మామా (మాల, మాదిగల) సమైక్య సమితి జాతీయ అధ్యక్షులు డా. మేడే శాంతి కుమార్, సౌతిండియా అధ్యక్షులు మాచర్ల సంపత్ కిషన్ అడ్వకేట్, మేకల సమూయేలు చెన్నకేశవులు, చుక్కా రమేష్, ముచ్చపోతుల రవి తదితరులు సంఘీభావం తెలిపారు.