హోలీ’ వస్తుందంటే చాలు.. దేశమంతా పండుగే. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇదీ ఒకటి. ఈ పండుగ సత్య యుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. హోలీని ‘హోళికా పుర్ణిమ’గా కూడ వ్యవహరిస్తారు. ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను.. హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా అంటారు. ఈ ఏడాది మార్చి 8వ తేదీన ఈ హోలీ పండుగ వచ్చంది. ఈ సందర్భంగా పుట్టుపుర్వోత్తరాల గురించి పురాణాల్లో ఎలాంటి భిన్నమైన కథలు ప్రచారంలో ఉన్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
హోలికా దహనం రోజునే..
రాక్షస రాజు హిరణ్యకశపుడి కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణు మూర్తిని స్మరిస్తుంటాడు. అది హిరణ్యకశపుడికి నచ్చదు. దీంతో ప్రహ్లాదుడిని మట్టుబెట్టాలని నిర్ణయించుకుంటాడు. దీంతో అతని రాక్షస సోదరి హోళికను పిలుస్తాడు. ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుడిని మంటల్లో ఆహుతి చేయాలని ఆమెను కొరతాడు. దీంతో ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లోకి దూకుతుంది. అయితే, విష్ణు మాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయపడగా, హోళిక రాక్షసి మాత్రం ఆ మంటల్లో చనిపోతుంది. హోలిక దహనమైన రోజునే ‘హోలీ’ అని పిలుస్తారనే ప్రచారం ఉంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళ ‘హోలిక’ దహనం నిర్వహిస్తారు.
డోలోత్సవం ఎందుకంటే..
వంగ దేశంలో డోలోత్సవం లేదా డోలికోత్సవం జరుపుకుంటారు. ఆరోజు శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలోని పువ్వులతో, రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్లుగా భావిస్తారు. ఇలా రంగులు, పూలు చల్లుకోవడం ద్వారా ప్రేమ, సౌభాగ్యాలు వెల్లివిరిస్తాయని నమ్ముతారు.
కృతయుగంలో రఘునాథుడనే సూర్యవంశపు మహారాజు వుండేవాడు. ఓ రోజు ప్రజలంతా వచ్చి ‘హోళిక’ అనే రాక్షసి తమ పిల్లలను బాధిస్తోందని మొరపెట్టుకుంటారు. ఆ సమయంలో అక్కడే ఉన్న నారద మహర్షి.. ఏటా ఫాల్గుణ పూర్ణిమ రోజు హోళికను పూజిస్తే బాధలు తొలగిపోతాయని తెలుపుతాడు. ఆ పూజలు పగటి వేళ చేస్తే కష్టాలు వస్తాయని, అంతా రాత్రివేళ నిర్వహించాలని వివరిస్తాడు. దీంతో అప్పటి నుంచి ‘హోలీ’ పూజలు నిర్వహిస్తున్నట్లు పూర్వికులు తెలుపుతుంటారు.
డోలిక అంటే..
డోలిక అంటే ఉయ్యాల అని అర్థం. బాలబాలకృష్ణుడిని ఫాల్గుణ మాసం, పూర్ణిమ తిథిలో ఉయ్యాలలో వేసినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో హోలీ రోజున శ్రీకృష్ణుడి ప్రతిమను ఊయలలో వేసి ‘డోలికోత్సవం’ జరుపుతారు. ఈ హోలి రోజున శ్రీకృష్ణుడు.. రాధను ఊయాలలో పెట్టి రంగులు పులిమినట్లు కూడా చెబుతుంటారు.
హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో పౌర్ణమి తిథి నాడు హోలీ పండుగను జరుపుకుంటారు. ఈసారి మార్చి 8వ తేదీన బుధవారం నాడు హోలీ పండుగ వచ్చింది. ఈ నేపథ్యంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరూ రంగుల వానలో తడిచి ముద్దయ్యేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే హోలీ సందర్భంగా అన్ని ప్రాంతాల్లో రంగులను, పువ్వులను, గులాల్ చల్లుకుంటే.. అక్కడ మాత్రం రంగులకు బదులు బూడిదతో హోలీ వేడుకలను జరుపుకుంటారు. అంతేకాదు అందరి కంటే ముందుగా హోలీ పండుగకు నాలుగు రోజుల ముందే సంబరాలను జరుపుకుంటారు. ఈ సందర్భంగా హోలీ వేడుకలను అందరి కంటే భిన్నంగా బూడిదతో ఎందుకు జరుపుకుంటారు.. ఆ ప్రాంతం ఎక్కడుంది.. ఎందుకని అందరి కంటే ముందుగా వేడుకలను ప్రారంభిస్తారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
విభిన్న వేడుకలు ఎక్కడంటే..
ప్రపంచంలోనే అత్యంత విభిన్నంగా హోలీ వేడుకలను కేవలం ఇక్కడ మాత్రమే జరుపుకుంటారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాశీ విశ్వనాథుని పుణ్యక్షేత్రంలో హోలీకి ముందు రంగులకు బదులు బూడిదను చల్లుకుని వేడుకలను ప్రారంభిస్తారు. ఈ ఏడాది హోలీ పండుగను ఏకాదశి మరుసటి రోజు అంటే మార్చి 04వ తేదీన వారణాసిలోని మణికర్ణిక ఘాట్‌లో ఉదయం 11:30 గంటలకు జరుపుకోనున్నారు.
నాలుగు రోజులు ముందుగానే..
అఘోరీ కష్టాన్ని తొలగించేందుకు..
శివ భక్తులందరూ..
సాధారణంగా చనిపోయిన వారికి శోక సంద్రంతో వీడ్కోలు పలకడాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే రంగభరి ఏకాదశి నాడు మాత్రం అందుకు భిన్నంగా.. శివ భక్తులు కాలుతున్న మంటలపై పాటలు పాడుతూ.. నాట్యం చేస్తూ భక్తిలో మునిగి తేలుతూ.. ఒకరిపై ఒకరు బూడిద జల్లుకుంటూ హోలీ వేడుకలను జరుపుకుంటారు.
ప్రతికూల శక్తుల నుంచి విముక్తి..
హోలీ వేళ ఏ రాశుల వారు ఏ రంగులు వాడితే అదృష్టం పెరుగుతుందో తెలుసా..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, హోలీ పండుగ వేళ ఏ రాశి వారు ఎలాంటి రంగులను ఎంచుకుంటే జీవితం ఆనందంగా ఉంటుంది.. మీ రాశిని బట్టి అదృష్ట రంగులేంటో ఇప్పుడే చూసెయ్యండి...
తెలుగు పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో పౌర్ణమి తిథి నాడు రోజున హోలీ పండుగను జరుపుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా హోలీకా దహన వేడుకలను జరుకుంటారు. ఈ పవిత్రమైన రోజున చాలా మంది ప్రజలు కులమతాలకతీతంగా ఒకరిపై ఒకరు ఆనందంగా రంగులను జల్లుకుంటారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, హోలీ పండుగ సందర్భంగా ఉపయోగించే అనేక రంగులు తొమ్మిది గ్రహాలకు సంబంధించినవి. ఈ నేపథ్యంలో ఈసారి హోలీ పండుగ వేళ మీ రాశి చక్రాన్ని బట్టి మీ అదృష్టాన్ని పెంచే రంగులేవో తెలుసుకోండి.. హోలీ పండుగ రోజున అవే రంగులను వాడండి.. శుభఫలితాలను పొందండి...
మేష రాశి(Aries)..
ఈ రాశి వారికి అంగారకుడు(కుజుడు) అధిపతిగా ఉంటాడు. కాబట్టి మేష రాశి వారు ఎరుపు రంగు వాడటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే హోలీ పండుగ వేళ రోజ్, ఆరెంజ్ కలర్లతో హోలీ రంగులతో ఆడుకోవచ్చు. అయితే నీలం రంగులను వాడకూడదు.
వృషభ రాశి (Taurus)..
ఈ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. ఈ గ్రహాన్ని ప్రశాంతతకు ప్రతీకగా పరిగణిస్తారు. అందుకే ఈ రాశి వారికి తెలుపు శుభప్రదంగా భావిస్తారు. ఈ కారణంగా ఈ రాశుల వారు స్వభావరీత్యా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. అయితే హోలీ రోజున తెలుపు, గులాబీ రంగులతో హోలీ వేడుకలను జరుపుకోవచ్చు. ఈ రాశి వారు పొరపాటున కూడా ఎరుపు రంగులను వాడకూడదు.
కర్కాటక రాశి(Cancer)..
ఈ రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు. అందుకే ఈ రాశి వారు హోలీ పండుగ రోజున వెండి రంగులను వాడాలి. వీటితో పాటు పసుపు రంగులను కూడా వాడొచ్చు. ఈ రెండు రంగులతో మీ అదృష్టం పెరిగే అవకాశం ఉంటుంది. అయితే బ్లాక్, బ్లూ కలర్లను వాడకండి.
సింహ రాశి(Leo)..
సూర్యుడు అధిపతిగా ఉండే ఈ రాశి వారు హోలీ పండుగ వేళ ఎరుపు, పసుపు, ఆరెంజ్ కలర్లను వాడటం వల్ల అదృష్టం పెరుగుతుంది. అయితే ఆకుపచ్చ, నీలం రంగులు వాడితే అశుభ ఫలితాలొస్తాయి.
కన్య రాశి (Virgo)..
తులా రాశి (Libra)..
ఈ రాశి వారిని శుక్రుడు పాలిస్తాడు. కాబట్టి హోలీ పండుగ వేళ వెండి రంగును వాడటం శుభప్రదంగా ఉంటుంది. వీటితో పాటు నీలం, ఆకుపచ్చని రంగులను వేసుకోవచ్చు. ఈ రాశి వారు ఎరుపు, పసుపు, ఆరెంజ్ రంగులను వాడకూడదు.
వృశ్చిక రాశి(Scorpio)..
ఈ రాశి వారిని కుజుడు పాలిస్తాడు. ఈ నేపథ్యంలో హోలీ పండుగ వేళ ఎరుపు, ఆరెంజ్, వెండి, పసుపు రంగులను వాడొచ్చు. ఈ రంగులను వాడటం వల్ల శుభ ఫలితాలొస్తాయి. అయితే నీలి రంగు వాడకూడదని గుర్తుంచుకోండి.
ధనస్సు రాశి (Sagittarius)..
ఈ రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి హోలీ పండుగ వేళ ధనస్సు రాశి పసుపు, ఆరెంజ్, ఎరుపు రంగులను వాడొచ్చు. ఈ మూడు రంగులు అదృష్టాన్ని పెంచుతాయి. అయితే నీలి రంగు వాడకూడదు.
మకర రాశి (Capricorn)..
ఈ రాశి వారికి శని దేవుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి మకర రాశి వారు హోలీ పండుగ వేళ ఎల్లప్పుడూ నీలి రంగు ఉండేలా చూసుకోవాలి. దీంతో పాటు ఆకుపచ్చ, నలుపు రంగులు కూడా శుభ ఫలితాలను ఇస్తాయి. అయితే వీరు ఎరుపు, పసుపు, ఆరెంజ్ రంగులను వాడకూడదు. ఇవి అశుభానికి సంకేతంగా భావిస్తారు.
కుంభ రాశి (Aquarius)..
ఈ రాశి వారిని కూడా శని దేవుడే పాలిస్తాడు. కాబట్టి వీరు హోలీ పండుగ వేళ బ్లూ, గ్రీన్, బ్లాక్ కలర్లతో వేడుకలు జరుపుకోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అలాగే ఎరుపు, పసుపు, ఆరెంజ్ కలర్లను వాడకండి.
మీన రాశి (Pisces)..
గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. పై సమాచారాన్ని ‘‘ధర్మఘంట’’ దృవీకరించడం లేదు.