సౌత్ హీరోయిన్లు రష్మిక మందన్న, తమన్నా భాటియా తమ అందాలతో వీక్షకులను కనువిందు చేయనున్నారు. వర్ధమాన గాయకుడు అరిజిత్ సింగ్ తన గానామృతంతో ఐపీఎల్ ప్రేక్షకులను మైరమరపించేలా చేయనున్నాడు. పుష్ప సినిమాలో తన నటనతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు మరింత చేరువైంది రష్మిక మందన్న. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది తమన్న. వీరిద్దరికీ గాయకుడు అరిజిత్ సింగ్ తోడవడంతో మోతేరా స్టేడియం మోతెక్కిపోనుంది.
బౌండరీల మోత, వికెట్ల వేటకు సమయం ఆసన్నమైంది. రేపటి (మార్చి 31 )నుంచే ఐపీఎల్ - 2023 ప్రారంభం కానుంది. మైదానంలో కొదమసింహాల్లా తలపడేందుకు 10 జట్లు సై అంటే సై అంటున్నాయి.
ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్.. నాలుగుసార్లు ట్రీఫీని కైవసం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. కరోనా కారణంగా రెండేళ్ల పాటు స్వదేశానికి దూరంగా జరిగిన ఐపీఎల్ ఈ సారి పూర్తిస్థాయిలో భారత్‌లో జరగబోతోంది. దీంతో ఆరంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేసింది. పలువురు సూపర్ స్టార్లు, హీరోయిన్లు ప్రారంభ వేడుకల్లో పాల్గొనబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, అవేవీ నిజం కాదంటూ రష్మిక మందన్న, తమన్నా భాటియా, అరిజిత్ సింగ్ మాత్రమే ప్రదర్శన ఇవ్వనున్నట్లు ఐపీఎల్ నిర్వహకులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఐపీఎల్ 16వ సీజన్ షురూ.. ట్రోఫీతో పోజిచ్చిన 10 జట్ల కెప్టెన్లు
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదహారో సీజన్ రేపటితో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా 10 జట్ల కెప్టెన్లు ఈరోజు ట్రోఫీతో ఫొటోలకు పోజిచ్చారు.IPL 2023 : క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదహారో సీజన్ రేపటితో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా 10 జట్ల కెప్టెన్లు ఈరోజు ట్రోఫీతో ఫొటోలకు పోజిచ్చారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మహేంద్ర సింగ్ ధోనీ (Chennai Super Kings), హార్దిక్ పాండ్యా (Gujarat Titans), కేఎల్ రాహుల్ (లక్నో సూప్ జెయింట్స్), సంజూ శాంసన్ (రాజస్థాన్ రాయల్స్), శిఖర్ ధావన్ (పంజాబ్ కింగ్స్), నితీశ్ రానా (కోల్‌కతా నైట్ రైడర్స్), డేవిడ్ వార్నర్ (ఢిల్లీ క్యాపిటల్స్), కెప్టెన్ మార్క్రామ్ బదులు భువనేశ్వర్ కుమార్ (సన్‌రైజర్స్ హైదరాబాద్)లు ట్రోఫీతో కలిసి ఫోటోలు దిగారు. అయితే.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఈవెంట్‌కు హాజరు కాలేదు. రేపు (మార్చి 31న) సాయంత్రం 5ః30 గంటలకు ఐపీఎల్ పండుగ షురూ కానుంది. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని, కార్యదర్శి జై షాతో పాటు పలువురు అధికారులు టోర్నీ ప్రారంభ వేడుకలకు హాజరుకానున్నారు.
అదిరేలా ఆరంభ వేడుక
ఐపీఎల్ ఆరంభ వేడుకలను అట్టహాసంగా, కన్నులపండువగా జరగనున్నాయి. అందుకని సినీ సెలబ్రిటీలు, బాలీవుడ్ సింగర్స్‌తో బీసీసీఐ ప్రదర్శనలు ఏర్పాటు చేసింది. తెలుగు, కన్నడతో పాటు బాలీవుడ్‌లోనూ పాపులర్ అయిన రష్మిక మందాన(Rashmika Mandanna), మిల్క్‌బ్యూటీ తమన్నా భాటియా(Tamanna Bhatia,) డాన్స్‌తో అలరించనున్నారు. బాలీవుడ్ ఫేమస్ సింగర్ అర్జిత్ సింగ్ పాటలతో స్టేడియాన్ని హోరెత్తించనున్నాడు. అనంతరం పది జట్ల కెప్టెన్లు ట్రోఫీని ఆవిష్కరించనున్నారు. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్, నాలుగుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.
దాదాపుగా రెండు నెలల పాటు సాగే క్రికెట్ పండగను 12 నగరాల్లో నిర్వహించనున్నారు. ఒక్కో జట్టు లీగ్ మ్యాచ్ లో 14 మ్యాచ్‌లు ఆడనుంది. సీజన్ మొత్తం 70 మ్యాచ్ జరగనున్నాయి. క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2, ఫైనల్ కలిపి మొత్తం 74 మ్యాచులు జరుగుతాయి.
ఈ సారి ఎటువంటి కరోనా ఆంక్షలు లేకపోవడం ఆభిమానుల ఉత్సాహం రెట్టింపైంది. సొంత మైదానాల్లో తమ జట్ల మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూసే అవకాశం మూడేళ్ల తర్వాత దక్కిడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ పాత పద్దతిలోనే ఇంటా.. బయటా వేదికల్లో మ్యాచ్‌లను ప్లాన్ చేశారు.
బంతి బంతికి ఉత్కంఠ, మెరుపు ఫీల్డింగ్ విన్యాసాలు, రికార్డుల మీద రికార్డులు, స్టేడియం దాటి వెళ్లే బంతులు ఇవన్నీ ఐపీఎల్‌లో కనిపించే దృశ్యాలు. ఐపీఎల్ అంటేనే అభిమానులతో పాటు ఆటగాళ్లకు ఎక్కడలేని ఊపు వచ్చేస్తోంది.
ఇంటర్నేషల్ లీగ్‌లు ఎన్నీ ఉన్నా ప్రపంచంమంతా వేచి చూసేది మాత్రం ఐపీఎల్ కోసమే. క్రికెట్ పండగతో రెండు నెలల పాటు టీవీలకు అతుక్కోవడం ఖాయం. ఐపీఎల్ 2023 లీగ్ మ్యాచ్‌లు మధ్యాహ్నం 3.30, సాయంత్రం 7.30 సమయాల్లో జరగనున్నాయి.
ఈ సీజన్ ప్రత్యేకతలివే
గత సీజన్లతో పోల్చితే ఈసారి ఐపీఎల్ సరికొత్తగా ఉండనుంది. టోర్నీని మరింత ఆసక్తికరంగా మార్చేందుకు బీసీసీఐ కొన్నికొత్త నిబంధనలను తీసుకొచ్చింది. అవేంటటే.. ప్రతి జట్టు సొంత గ్రౌండ్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడనుంది. ప్రతి టీమ్ ఇంప్యాక్ట్ ప్లేయర్‌ను తీసుకొనే వెసులుబాటు ఉంది. అంతేకాదు టాస్ తర్వాత కూడా తుది జట్టులో మార్పులు చేసుకొనే వీలుంది.
ఐపీఎల్ కు కీలక ఆటగాళ్లు దూరం...
ఐపీఎల్ సమరానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. శుక్రవారం నుంచి సందడి ప్రారంభం కానుంది. అయితే ఈ ఐపీఎల్ కు మాత్రం కొందరు కీలక ఆటగాళ్లు దూరం కానున్నారు.
IPL 2023: ఐపీఎల్ సమరానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. శుక్రవారం నుంచి సందడి ప్రారంభం కానుంది. అయితే ఈ ఐపీఎల్ కు మాత్రం కొందరు కీలక ఆటగాళ్లు దూరం కానున్నారు. కోట్లు పెట్టి కొనుక్కున్న ఆటగాళ్లు సైతం దూరం అవనున్నారు. దీంతో ఆయా జట్ల అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ఆటకు దూరమవుతున్న ఆ కీలక ఆటగాళ్లేవరో ఇపుడు చూద్దాం.
ఐపీఎల్ సమరానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ మెగా ఈవెంట్ శుక్రవారం నుంచి సందడి చేయనుంది. అయితే ఈ ఐపీఎల్ కు మాత్రం కొందరు కీలక ఆటగాళ్లు దూరం కానున్నారు. కోట్లు పెట్టి కొనుక్కున్న ఆటగాళ్లు సైతం దూరం అవనున్నారు. దీంతో ఆయా జట్ల అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ఆటకు దూరమవుతున్న ఆ కీలక ఆటగాళ్లేవరో ఇపుడు చూద్దాం. తమ అభిమాన ఆటగాళ్ల ఆట కోసం ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కానీ వారికి నిరాశ తప్పేలా లేదు.
రిషబ్ పంత్: ఐపీఎల్ లో రిషబ్ పంత్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. గత సీజన్ లో దిల్లీకి కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇటీవలే రోడ్డు ప్రమాదానికి గురై.. ప్రస్తుతం కోలుకుంటున్నాడు.
దీంతో ఈ సీజన్ కు పంత్ అందుబాటులో ఉండటం లేదు. దీంతో అతడి స్థానంలో డెవిడ్ వార్నర్ కెప్టెన్ గా బాధ్యతలు అందుకున్నాడు.
కొన్ని మ్యాచ్ లకు పంత్ ను డగౌట్ లోకి తీసుకొస్తామని పాంటింగ్ తెలిపాడు.
బుమ్రా : టీమిండియా పేసర్.. బుమ్రా ఈ ఏడాది ఐపీఎల్ కు దూరం అవ్వనున్నాడు. గత ఆరు నెలలుగా ఆటకు దూరమయ్యాడు. అతడి స్థానంలో జోఫ్రా ఆర్చర్ రానున్నాడు.
శ్రేయస్ అయ్యర్: వెన్ను నొప్పి గాయం కారణంగా శ్రేయస్ దూరం కానున్నాడు. అతడి స్థానంలో.. నితీష్ రాణాను తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
జానీ బెయిర్‌స్టో: బెయిర్‌స్టో కాలికి సర్జరీ కారణంగా సీజన్ కు అందుబాటులో ఉండటం లేదు. అతడి స్థానంలో మాథ్యూ షార్ట్‌ను పంజాబ్ జట్టులోకి తీసుకుంది.
ప్రసిధ్ కృష్ణ : వెన్ను నొప్పి కారణంగా.. పేసర్ ప్రసిద్ కృష్ణ జట్టుకు దూరమవుతున్నాడు. అతడి స్థానంలో సందీప్ శర్మను జట్టు ఎంపిక చేసుకుంది.
రజత్ పటిదార్: గతేడాది అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. మడమ గాయం కారణంగా ఈ సీజన్ తొలి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు.
ముఖేశ్ చౌదరి : చెన్నై యువ పేసర్ ముఖేశ్ చౌదరి.. ఈ సీజన్‌కు మిస్సయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అతడు త్వరగా కోలుకొని జట్టులోకి రావాలని చెన్నై సీఈవో కాశీ విశ్వనాథ్ వెల్లడించాడు.
జోష్ హేజిల్‌వుడ్ : గాయం కారణంగా ఈ సీజన్ తొలి అర్ధభాగానికి దూరం అవుతున్నాడు.
కైల్ జేమీసన్ : జేమీసన్.. వెన్ను గాయం కారణంగా ఆటకు దూరంగా ఉంటున్నాడు. ఇతడి స్థానంలో స్థానంలో దక్షిణాఫ్రికా పేసర్ సిసిందాతో ఒప్పందం చేసుకుంది.
గ్లెన్ మాక్స్‌వెల్: మోకాలి గాయం కారణంగా గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది.