సద్దల చెరువుకు కొత్త శోభ - 72 లక్షల వ్యయంతో పైలాన్

సూర్యాపేట పట్టణానికి ఆహ్లాదానికి ఆదరువుగా ఉన్న సద్దల చెరువుకు మరో కొత్త శోభ జతకానున్నది. చెరువు మధ్యలో 100అడుగుల ఎత్తుతో ఒక కట్టడం దాని కింది భాగాన ఆహ్లాద కరమైన గార్డెన్, సేద తీరేందుకు ఒక క్యాంటీన్ ఇతర సౌకర్యాతో ఒక నిర్మాణానికి మంగళవారం శ్రీకారం చుట్టారు.

ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ పి.రామానుజుల రెడ్డితో పాటు నిర్మాణ పనుల్లో అనుభవం గడిచిన సంస్థ ప్రతినిధులు మొత్తం నిర్మాణం జరగవలసిన ప్రాంతాన్ని పరిశీలించారు. (72) డెబ్బైరెండు లక్షల వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మించనున్నారు. పట్టణంలోని ప్రజలు ఆహ్లాదాన్ని పంచుకునేందుకు అక్కడికి చేరుకోవచ్చు.. ఇప్పటికే బోటింగ్ సౌకర్యాన్ని కల్పించిన పురపాలక సంఘం పట్టణ ప్రజలకు ఈ ఆహ్లాదపు కట్టడాన్ని త్వరలో అందించనుంది..సూర్యాపేట ప్రజలకు ఇది నిజంగానే ఒక వరం నగరాలలో మాత్రమే ఉండే ఇలాంటి వినోద భరిత నిర్మాణాలు సూర్యాపేటలో కూడా ఏర్పాటు చేయడం ఆనందదాయకమే. అక్కడ పర్యాటకులు కొద్దిసేపు ఉండి తిరిగి బోట్ల ద్వారా బయటికి వస్తారు.. ఈ ఆహ్లాద వాతావరణం సాధ్యమైనంత త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానునట్టుగా కమిషనర్ తెలిపారు.

ఐలాండ్ , వాటర్ ఫౌంటయిన్ , గ్రీనరీ నందు నిర్మించనున్న  ఫైలాన్ నిర్మాణము పనులలో భాగంగా ప్రత్యేక బల్ల కట్టును తీసుకొని వొచ్చి చెరువు అంత తిరిగి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో  ఇ.ఇ.జి.కె.డి .ప్రసాద్ , డి.ఇ. సత్యారావు , ఎస్.ఎస్.ఆర్.ప్రసాద్ , రంజిత్ తదితరులు పాల్గొన్నారు..