మెరుగైన చికిత్స కోసం.. ఎయిర్ అంబులెన్స్ లో.. విదేశాలకు తారకరత్న..?

గత వారం రోజులుగా తారకరత్న వెంటిలేటర్‌పైనే ఉన్నాడు. ట్రీట్ మెంట్ తీసుకుంటూ ఉన్నారు. గత శుక్రవారం కుప్పంలో నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం యాత్రలో గుండెపోటుకు గురయ్యాడు తారకరత్నం.

పరిస్థితి విషమించడంతో.. ఆయన్ను బెంగళూరుకు తరలించారు. పాదయాత్రలో కుప్పకూలిన తారకరత్న.. ఇంతవరకూ స్పృహలోకి రాలేదు. ఆయన్ను కాపాడేందుకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ డాక్టర్లు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

నందమూరి బాలకృష్ణ స్వయంగా దగ్గరుండి తారకరత్నకు అందుతున్న వైద్యం గురించి చూసుకుంటున్నారు. అహర్నిశలు కృషి చేస్తున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు నందమూరి కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తున్నారు. అలాగే హాస్పిటల్ వారు కూడా ఎప్పటికప్పుడుహెల్త్‌ బులిటెన్‌ విడుదల చేస్తున్నారు. అటు నందమూరి అభిమానులు తారకరత్న త్వరగా కోలుకోవాలని పూజలు కూడా చూసేస్తున్నారు

ఇది ఇలా ఉండగా.. తారకరత్న ఆరోగ్యం గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. వదంతులునమ్మొద్దు అని నందమూరి కుటుంబం చెపుతున్నా.. తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన పూర్తిగాకోలుకోలేదని.. ఇంకా చాలా టైమ్ పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాదు అవసరం అయితే తారకరత్నను విదేశాలకు తీసుకువెళ్ళే అవకాశం కూడా ఉందంటున్నారు. ఇక్కడి ట్రీట్ మెంట్ కు ఆయన కోలుకుంటే సరి.. లేకుండే పక్కాగా విదేశాలకు వెళ్తామంటున్నారు.

తారకరత్న మెదడుకు స్కాన్‌ తీసినట్లు టీడీపీ హిందుపూర్‌ పార్లమెంట్ జనరల్‌ సెక్రటరీ అంబికా లక్ష్మీనారాయణ వెల్లడించారు. వచ్చే రిపోర్టులను బట్టి మెదడు పరిస్థితి ఎలా ఉందని తెలుస్తుందని, దాన్ని బట్టి కుటుంబసభ్యులు తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నారని తెలిపారు. కాగా గుడెపోటు వచ్చిన టైమ్ లో 45 నిమిషాలు గుండె ఆగిపోవడం వలన తారకరత్న మెదడులో మెదడులో నీరు చేరి మెదడు వాచిందని, వాపు తగ్గిన వెంటనే బ్రెయిన్‌ రికవరీ అవుతుందని డాక్టర్లు అంటున్నారు.