ఆ మధుర క్షణాలను మర్చిపోలేను..
ఇంటర్నేషనల్ క్రికెట్‌తో పాటు అన్ని రకాల ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. 2002 నుంచి 2017 వరకు సాగిన నా క్రికెట్ ప్రయాణంలో ఎన్నో ఏడాదులు అద్భుతంగా గడిచాయి. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం నేను సాధించిన గొప్ప గౌరవం. ఈ అవకాశం కల్పించిన బీసీసీకి కృతజ్ఞతలు. 2007లో తొలి టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన జట్టులో సభ్యుడిగా ఉండడం నా అదృష్టం. ఫైనల్‌లో ధోని నన్ను నమ్మి బంతిని చేతిలో పెట్టడం.. ఒత్తిడిలో బౌలింగ్ చేసి టీమిండియాను గెలిపించడం నా జీవితంలో ఎప్పటికి మరిచిపోలేను. రిటైర్మెంట్ తర్వాత ఇష్టపడ్డ క్రికెట్‌లోనే కెరీర్ కొనసాగాలనుకుంటున్నా. నా జీవితంలో కొత్త అధ్యాయం కోసం ఎదురుచూస్తున్నా' అని తన రిటైర్మెంట్ సందేశంలో తెలిపాడు జోగిందర్.