హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలివన్డేలో టీమ్ఇండియా ఘనవిజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 349 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో 49.2 ఓవర్లలో కివీస్ 337 పరుగులకు ఆలౌటైంది.
ఇండియా బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్(208)పరుగులతో అదరగొట్టగా.. బౌలర్ సిరాజ్ 4 వికెట్లు తీశాడు. కాగా.. కివీస్ బ్యాట్స్‌మెన్ బ్రేస్‌వెల్(140) సెంచరీతో రాణించాడు.
ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన మొదటి వన్డేలో భారత (IND vs NZ) జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 12 పరుగుల తేడాతో గెలుపొందింది. 350 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 337 పరుగులు చేసి అల్ అవుట్ అయ్యింది. కివీస్ జట్టులో బ్రాస్ వెల్ (140) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే అతనికి తోడుగా జట్టును విజయతీరాలకు చేర్చే ఇన్నింగ్స్ మాత్రం ఎవరూ ఆడలేదు. టీమిండియా బౌలర్ మహమ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు, హార్దిక్, షమీ చెరో వికెట్ తీసి టీమిండియా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో 349 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ గిల్ ఈ మ్యాచ్ లో 208 పరుగులు సాధించాడు. గిల్ డబల్ సెంచరీ బాదడంతో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. గిల్ 208 స్కోర్‌తో నిలిచాడు. సెంచరీ వరకు నిదానంగా ఆడిన గిల్ ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడాడు. గిల్ మొత్తంగా 149 బంతుల్లోనే 19 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 208 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ (38 బంతుల్లో 4ఫోర్లు, 2 సిక్స్ లతో 34) కూడా రాణించాడు. ఈ విజయంతో భారత జట్టు మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఉప్పల్‌లో పరుగుల ఉప్పెన.. చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్
న్యూజిలాండ్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు కనిపించాయి. ఉప్పల్‌లో పరుగుల ఉప్పెన సృష్టించాడు ఓపెనర్ శుభ్‌మన్ గిల్.
ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ హీరో శుభ్‌మన్ గిల్ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. అతి చిన్న వయసులోనే డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 2013లో ఆస్ట్రేలియాపై బెంగళూరులో రోహిత్ శర్మ (26 ఏళ్ల 186 రోజులు) తక్కువ వయసులో డబుల్ సెంచరీ చేయగా.. ఇటీవల బంగ్లాపై డబుల్ సెంచరీతో ఇషాన్ కిషన్ (24 ఏళ్ల 145 రోజులు) బద్దలు కొట్టాడు. తాజాగా ఈ రికార్డును గిల్ (23 ఏళ్ల 132 రోజులు) సవరించాడు.
182 పరుగుల నుంచి గిల్ వరుసగా మూడు సిక్సర్లు బాది డబుల్ సెంచరీ మార్క్ చేరుకోవడం విశేషం. ఇతర బ్యాట్స్‌మెన్ మొత్తం ఒకరి తరువాత ఒకరు ఔట్ అవుతున్నా.. గిల్ మాత్రం పట్టువీడలేదు. ఒంటరి పోరాటం చేశాడు. సింగిల్స్, డబుల్స్ తీస్తూ.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు.
19వ ఓవర్‌లో 45 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద గిల్‌కు ఒకే బంతికి రెండు లైఫ్‌లు వచ్చాయి. క్రీజ్ వదిలి ముందు భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా మిస్ అయింది. కీపర్ లాథమ్ క్యాచ్‌ను మిస్ చేయగా.. స్టంపింగ్ కూడా చేయలేకపోయాడు. దీంతో ఒకే బంతికి రెండు లైఫ్‌లు వచ్చాయి. ఆ తరువాత భారీ సిక్సర్‌తో గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక్కడి నుంచి జట్టు ఇన్నింగ్స్‌ను అంతా తానై నడిపించాడు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యాలతో కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. చివర్లో అయితే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుసగా సిక్సర్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. చివరి ఓవర్‌లోనూ భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్‌కు చేరుకున్నాడు. కేవలం 19 ఇన్నింగ్స్‌ల్లోనే 1,000 పరుగులు పూర్తి చేశాడు గిల్. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా వెయి పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. ఫఖర్ జమాన్ కేవలం 18 ఇన్నింగ్స్‌ల్లోనూ వెయి రన్స్ చేసి మొదటిస్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా గిల్ నిలిచాడు. గతంలో సచిన్ 186 పరుగులు చేశాడు.
మరో వివాదాస్పద నిర్ణయం.. హార్దిక్ పాండ్యా ఔటా.. నాటౌటా...
హార్దిక్.. హార్దిక్.. హార్దిక్.. క్రికెట్ ఫ్యాన్స్ మాత్రమే కాదు ఎక్స్‌పర్ట్స్ సైతం ఈ ప్లేయర్ జపమే చేస్తున్నారు.
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడినా, టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఔట్ అయిన తీరు చర్చనీయాంశంగా మారింది.
అసలు సమస్య ఇక్కడే మొదలైంది. పాండ్యా ఔట్ విషయంలో క్లారిటీ లేకపోవడంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌ను రివ్యూ కోరాడు. రిప్లేలో కూడా బంతి ఎక్కడా నేరుగా వికెట్లను తాకినట్లుగా కనిపించలేదు. అయితే కీపర్ టామ్ లాథమ్ గ్లోవ్స్ మాత్రం వికెట్లను తాకినట్లు కనిపించింది. అదే సమయంలో బంతి కూడా లాథమ్ చేతుల్లో పడింది. లాథమ్ బంతి అందుకోకముందే బెయిల్స్ ఎగురగొట్టినట్లు పరిగణించిన థర్డ్ అంపైర్ పాండ్యాను బౌల్డ్‌గా ప్రకటించి ఔట్ ఇచ్చాడు. అంతే కివీస్ ఆటగాళ్లు సంబరాలు జరుపుకోగా.. షాకవడం పాండ్యా వంతైంతి.