మహబూబాబాద్‌లో సకల హంగులతో నూతన కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. జిల్లా కేంద్రంలోని సాలార్ తండా వద్ద ఎన్‌హెచ్ 365 పక్కనే 30 ఎకరాల సువిశాల స్థలంలో రూ.54 కోట్లతో కలెక్టరేట్ భవనాన్ని నిర్మించారు.
మహబూబాబాద్‌లో సకల హంగులతో నూతన కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. జిల్లా కేంద్రంలోని సాలార్ తండా వద్ద ఎన్‌హెచ్ 365 పక్కనే 30 ఎకరాల సువిశాల స్థలంలో రూ.54 కోట్లతో కలెక్టరేట్ భవనాన్ని నిర్మించారు. కలెక్టరేట్ ముందు సీసీ రోడ్లను నిర్మించగా, కలెక్టరేట్ ముందు భాగంలో గార్డెన్లను ఏర్పాటు చేశారు. వాటిలో మొక్కలు నాటి అందంగా తీర్చిదిద్దారు. ఈ నెలలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ భవన సముదాయాన్ని ప్రారంభించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది.