క్రికెట్ చరిత్రలోనే థ్రిల్లింగ్ ఓవర్




భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఉత్కంఠ. అదే చివరి వరకూ ఆ టెన్షన్ కొనసాగితే ఆ కిక్కే వేరు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో అదే జరిగింది. చివరి బంతి వరకు ఎవరు గెలుస్తారో చెప్పలేని విధంగా సాగిందీ టీ20 ప్రపంచకప్ మ్యాచ్. ఎంతో ఉత్కంఠతతో ఈ మ్యాచ్ చివరి ఓవర్లో 16 పరుగులు అవసరం కాగా తొలి బంతికే పాండ్యా అవుటయ్యాడు. ఆ తర్వాత సింగిల్, డబుల్ వచ్చాయి. ఆ మరుసటి బంతికి కోహ్లీ సిక్సర్ బాదగా.. అది నోబాల్. ఫ్రీ హిట్ డెలివరీ వైడ్ అయింది. దీంతో మరో బంతి వేశారు. దీనికి మూడు రన్స్ వచ్చాయి. ఆ తర్వాత రెండు బంతుల్లో రెండు పరుగులు అవసరం అయ్యాయి. ఈ సమయంలో దినేష్ కార్తీక్ స్టంప్ అవుట్ అయ్యాడు. నవాజ్ వేసిన బంతిని ముందుకొచ్చి బాదేందుకు అతను ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో బంతి అందుకున్న రిజ్వాన్.. వికెట్లను పడగొట్టాడు. మరుసటి బంతి వైడ్. చివరి బంతికి అశ్విన్ సింగిల్ తీయడంతో భారత్ విజయం సాధించింది. దీంతో ఈ ఓవర్ క్రికెట్ చరిత్రలోనే థ్రిల్లింగ్ ఓవర్ అయ్యింది.