నల్లగొండ: 74 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఎస్పీ ఏ.వి. రంగనాధ్ జాతీయ జెండా ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ నర్మద, జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో డిటిసి అదనపు ఎస్పీ సతీష్ చోడగిరి, ఆర్ముడ్ రిజర్వ్ కార్యాలయంలో ఏ.ఆర్. డిఎస్పీ సురేష్ కుమార్, నల్లగొండ సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ నిగిడాల సురేష్, టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్.ఐ. నర్సింహులు, రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్.ఐ. రాజశేఖర్ రెడ్డిలు జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో డిఎస్పీలు వెంకటేశ్వర్ రెడ్డి, రమణారెడ్డి, సురేష్ కుమార్, సిఐలు రవీందర్, ప్రభాకర్ రెడ్డి, ఆర్.ఐ.లు వై.వి. ప్రతాప్, నర్సింహా చారి, స్పర్జన్ రాజ్, భరత్ భూషణ్, నర్సింహా, పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజ్, నాయకులు సోమయ్య, సిబ్బంది కార్తీక్, గురువయ్య, శ్రీరామ్, నగేష్, రియాజ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్జ్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు.
కరోనా విపత్కర పరిస్థితిల్లో ప్రజలను చైతన్యం చేస్తూ 'లాక్ డౌన్' ను ఎస్పీ ఏ.వి. రంగనాధ్ నేతృత్వంలో పోలీస్ శాఖ సమర్ధవంతంగా పని చేసిన విధానంపై స్పందిస్తూ, వారి కృషిని అభినందిస్తూ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎస్పీ రంగనాధ్ ను శాలువాతో సన్మానించి, అబినందనలు తెలిపారు.