- మనువాద ఆలోచనతో చేసే మంద కృష్ణ మాదిగ దేవాలయపు దొంగ నిద్రలు మానుకోవాలని డిమాండ్...
నల్లగొండ: మంద కృష్ణ మాదిగ మనువాద కుట్రకు వ్యతిరేకంగా మాదిగ యూత్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పెరిక కరణ్ జయరాజ్ మాదిగ స్థానిక అంబేద్కర్ భవనంలో నిద్ర చేస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ మాదిగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పిడమర్తి రవి మాదిగ పిలుపుతో, మంద కృష్ణ మాదిగ దళిత జాతులను నిద్రలేపే నెపంతో మనువాదులకు, వారి పార్టీలకు తొత్తుగా మారినాడని, భవిష్య తరాలకు మాదిరిగా ఉండవలసిన నేత రోజు అంబేద్కర్ ఆలోచన విధానాలకు వ్యతిరేకంగా మనువాదుల గుడులల్లో నిద్ర చేస్తుండటం శోచనీయంగా ఉందన్నారు. మంద కృష్ణ మాదిగ నటించే నిద్ర స్వార్ధ, స్వప్రయోజనాలకేనని, బీజేపీ తాయిలాలకై, వారి ఆకర్షణకై ఇదంతా చేస్తున్నాడని, అంబేద్కర్ ఏనాడైనా ఇలాంటి మనువాదపు చర్యలు చేపట్టలేదని, విద్యావంతులు, మేధావులు, అంబేద్కర్ భావాజాల ప్రచారకులందరు నిరసనలు తెలపాలని, భవిష్య తరాలను తప్పు త్రోవలకు పురికొల్పే దుశ్చర్యలు వెంటనే మానుకోవాలని డిమాండ్ చేశారు.
మాదిగ యూత్ జేఏసీ నల్గొండ పట్టణ అధ్యక్షులు భూషపాక హరీష్ మాదిగ, జిల్లా నాయకులు ఒగ్గు మౌళి భార్గవ్ మాదిగ, పున్న సత్యం మాదిగ తదితరులు ఆయనతో నిద్ర చేశారు.