మాములుగా రోగాలకు మందులు కనుగొనడం ఈజీ. కానీ, వైరస్ మందులు కనుగొనడం చాలా కష్టం. ఎందుకంటే వైరస్ లు శరీర కనజాలంలోకి ప్రవేశించే వరకు ఒక రూపం అంటూ ఉండదు. అందుకే కరోనా లాంటి మహమ్మరులు దాడులు చేస్తే, దాని నుంచి బయటపడేందుకు ప్రపంచానికి ఎక్కువ సమయం పడుతుంది. కరోనా లాంటి మహమ్మరులను ఎదుర్కుకొనాలి అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి. శరీరంలో తగినంత సి విటమిన్ ఉండాలి.
విటమిన్ సి తో పాటుగా జింక్ కూడా శరీరానికి చాలా అవసరం. జింక్ రోగ నిరోధక కణాల పనితీరును మెరుగుపరచడమే కాకుండా, ఆ కణాలను బలోపేతం చేస్తుంది. ఫలితంగా వ్యాధి నిరోధక కణాలు రోగకారక క్రిములపై దాడి చేసి చంపేస్తాయి. అందుకోసమే ఆహారంలో జింక్ మూలకం ఉండేలా చూసుకోవాలని వైద్యనిపుణులు చెప్తున్నారు. ఇక జింక్ అధికంగా లభించే ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పుచ్చకాయ విత్తనాలు, చేపలు, గుడ్లు, పెరుగు, గింజలు, విత్తనాలు, శనగలు, బెర్రీస్ వంటి వాటిల్లో జింక్ మూలకం ఎక్కువగా ఉంటుంది. వీలైనంత మేరకు నిత్యం ఆహారంలో ఈ పదార్థాలు ఉపయోగించాలని న్యూట్రీషన్లు చెప్తున్నారు.