గ్రేటర్ లో భయం భయం


హైదరాబాద్: గ్రేటర్ లో కరోనా కోరలు చాస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. మాలక్ పేట్ లో 23 మందికి కరోనా సోకింది. మల్కాజిగిరి లో 12 మందికి కరోనా పాజిటివ్ గా నిర్థారించారు. బాలానగర్ ఫిరోజ్ గూడలో ర్యాపిడ్ యాంటీజేన్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈరోజు 59 మందికి పరీక్షలు నిర్వహించగా 12 మంది పాజిటివ్ గా తేలింది. జూలై మొదటి నుంచి కరోనా కేసుల సంఖ్య గ్రేటర్ వాసులనుభయపెడుతోంది. ఈనెల మూడో తేదీన రికార్డ్ స్థాయిలో 1,658 కేసులు నమోదు కాగా , ఆ తర్వాత నుంచి కొంత తగ్గుముఖం పట్టాయి. అయినా, రోజుకు పదిహేను వందలకు సమీపంలో కేసులు ఉంటున్నాయి. కరోనా నిర్ధారణ కోసం జనం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద, ప్రయివేటు ఆస్పత్రుల వద్ద క్యూ కడుతున్నారు.