కరోనా టెస్టులు, చికిత్స విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్.... ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ కరోనా టెస్టులు, కరోనా ట్రీట్ మెంట్ ఉచితంగా అందించాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కరోనా టెస్టులు, చికిత్స ఉచితంగా అందించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీని కోసం మొదట మూడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ఎంపిక చేసింది ప్రభుత్వం.... మల్లారెడ్డి మెడికల్ కాలేజ్, మమతా మెడికల్ కాలేజ్, కామినేని మెడికల్ కాలేజీల్లో మొదట కరోనా టెస్టులు, కరోనా చికిత్సలు ఉచితంగా అందించనున్నారు....దీనికి సంబంధించిన పూర్తి విధివిధానాలు తెలియాల్సి ఉండగా... ఆ తర్వాత ఈ సేవలను మరిన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు విస్తరించే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు.
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.... ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ కరోనా టెస్టులు, చికిత్స ఫ్రీ