తెలంగాణలో మరోసారి భారీగా కేసులు


హైదరాబాద్: తెలంగాణలో మరోసారి భారీగా కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1879 కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 1422 కేసులు వచ్చినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ లో పేర్కొంది. ఇవాళ మరో ఏడుగురు మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 27,612 కి చేరగా.....మొత్తం మరణాల సంఖ్య 313 కి పెరిగింది.


గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 6,220 మంది కరోనా పరీక్షలు నిర్వహించగా....4,341 మందికి నెగిటివ్ గా తేలింది. ఇవాళ మరో 1506 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొంది. ప్రస్తుతం 11,012 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది.