హైదరాబాద్: హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో ఇండియా ప్రజా బంధు పార్టీ తెలంగాణ రాష్ట్ర జిల్లాల అధ్యక్షుల నియామక సమావేశంలో జాతీయ అధ్యక్షులు దేశభక్త డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ పార్టీ యొక్క భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను దిశ నిర్దేశించారు. తొమ్మిది మందికి అధికారిక నియామక పత్రాలు అందజేశారు. నూతనంగా పార్టీలోకి తీసుకువచ్చిన కళ్యాణి బృందం రంజితన్నను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి రుంజాల నోబుల్, కోశాధికారి తోట నర్సింలు, డిసిప్లినరీ కమిటీ చైర్మన్ నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ పాలమాకుల మధు, మహిళా బంధు అధ్యక్షురాలు శీబాప్రవీన్, యాదల అబ్బులు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ అరుణ్ కుమార్, కార్యదర్శి కరుణాకర్ ఉపాధ్యక్షులు రాజ్ ప్రకాష్, భీమయ్య, మహిళ కార్యదర్శి శైలజా, జానపటి వెంకటేష్, సదశివరావు, గోపురం కిరణ్ కుమార్ జిల్లాల అధ్యక్షులు కాశీ సతీష్, మాతంగి స్వరాజ్, తాళ్లపల్లి రాజ్ కుమార్, మంగు రాంచంద్రు, పెంట శ్రీనివాస్, పర్నంద్ రమేష్ చంద్ర, కూనదొడ్డి యిర్మీయా, కనకమ్ కమలాకర్, దోసల చంద్రం, విసనకర్ర అమర్ నాద్ పలువురు నాయకులు పాల్గొన్నారు.