కరోనాను ఎదుర్కొనేందుకు ప్రజలు పాటించాల్సిన వంటింటి చిట్కాలివే....?


కొన్ని నెలల క్రితం వరకు ప్రజలు వంటింటి చిట్కాలపై పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. పాలలో పసుపు కలుపుకుని తాగమని చెప్పినా....కషాయం తాగాలని సూచించినా పెద్దగా ఆసక్తి చూపేవాళ్ళు కాదు. కానీ కరోనా వైరస్  పరిస్థితులను పూర్తిగా మార్చేసింది. రోగనిరోధక శక్తిని పెంచుకుంటే మాత్రమే వైరస్ ను జయించడం సాధ్యమవుతుందని వైద్యులు చెప్పడంతో చాలామంది వంటింటి చిట్కాలను ఆశ్రయిస్తున్నారు.


రోజురోజుకు ఇంటి వైద్యానికి ప్రాధాన్యత పెరుగుతోంది. ప్రతి చిన్న రోగానికి మెడికల్ షాపుల్లోని మాత్రలపై ఆధారపడిన ప్రజలు ఇప్పుడు తమ వైఖరిని  పూర్తిగా మార్చుకుంటుంన్నారు. వంటింటిలో ఉండే దినుసుల గొప్పదనం గురించి తెలుసుకుంటూ పాత పద్దతిలో కషాయాలు తయారు చేసుకుని తాగుతున్నారు.            గోరు వెచ్చని పాలలో పసుపు కలుపుకుని తాగుతున్నారు.  అల్లం టీ, లేమన్ టీ లాంటి వాటికి కూడా క్రమంగా ప్రాధాన్యత పెరుగుతోంది.


సాధారణ వ్యక్తి నుంచి ప్రజా ప్రతినిధులు, వ్యాపారులు, ఉన్నతాధికారులు, ఉద్యోగులు వంటింటి చిట్కాలపై  ఆసక్తి చూపుతున్నారు. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా రోగాలను నయం చేసుకోవడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ఎవరిలోనైనా జలుబు లక్షణాలు కనిపిస్తే పసుపు కలిపిన పాలను తాగడం మంచిది. తులసి మొక్కల ఆకులను గోరువెచ్చని నీటిలో వేసుకొని తాగినా కూడా ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.


మిరియాలు, శొంఠి కొమ్ము, అల్లం, లవంగాలతో      తయారు చేసిన కషాయంను రోజూ ఉదయం, సాయంత్రం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మిరియాల చారు, మిరియాలు ఉండే కూరలు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. తులసి దాల్చిన చెక్క, నల్లమిరియాలు, శొంఠి వేసిన కషాయం లేదా తేనెలో కృష్ణతులసి ఆకుల రసం కలుపుకుని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.