హైదరాబాద్: రాష్ట్రంలో కంటేయిన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ పొడగించారు. బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాగా రాష్ట్రంలో మళ్ళీ లాక్ డౌన్ ను విధిస్తున్నట్లు వార్తలొస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఇదే క్రమంలో.... కొన్ని ప్రాంతాల్లోనైతే ప్రజలు స్వచ్ఛందంగానే లాక్ డౌన్ ను విధించుకున్న విషయం కూడా విదితమే.
ఏఏ క్రమంలోనే.....ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజా ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వుల ప్రకారం వివరాలిలా ఉన్నాయి. రాష్ట్రంలోని కంటైన్మెంట్ జోన్లలో ఈ నెల 31 వరకు లాక్ డౌన్ పొడిగించారు. తాజా ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయి.
ఇక...రాత్రి 10 గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో....రాత్రి 9: 30 గంటల సమయానికే దుకాణాలను మూసివేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు.
అయితే.... అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపులనిచ్చింది. రాష్ట్రంలో జూన్ 30 వరకు విధించిన లాక్ డౌన్ మంగళవారంతో ముగిసిన విషయం తెలిసిందే. కాగా...ఆన్ లాక్ 2.0 నేపథ్యంలో సడలింపులనిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో.... కేంద్రం మార్గదర్శకాలకనుగునంగానే రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను రూపొందించినట్లు సమాచారం.