తెలంగాణ సైనికుడి వీరమరణం


రామగిరి(మంథని): జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్ వద్ద సోమవారం తెల్లవారుజామున పాకిస్థాన్ ఉగ్రవాదుల దాడిలో తెలంగాణ లోని పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగెపల్లి గ్రామానికి చెందిన సైనికుడు శాలిగాం శ్రీనివాస్ (28) వీరమరణం పొందాడు.  శ్రీనివాస్ ఏడేళ్ల క్రితం సైన్యంలో చేరాడు. వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించాడు. రెండేళ్ల క్రితం పెళ్లయింది. కరోనా వ్యాప్తికి ముందు స్వగ్రామనికి వచ్చాడు. ఇక్కడ నుంచి వెళ్ళాక 14 రోజులు క్వారంటైన్ లో ఉన్నాడు. అనంతరం విధుల్లో చేరాడు.