తెలంగాణ లో కరోనా కల్లోలం.....


హైదరాబాద్: తెలంగాణ లో తాజాగా 1,850 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఐదుగురు మృతి చెందారు. ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 22,312 కి చేరుకుంది. మొత్తం 288 మృతి చెందారు. శనివారం 6,427 మందికి కోవిడ్ టెస్టులు చేశారు. తెలంగాణ లో ఇప్పటివరకూ మొత్తం 1,10,545 మందికి కోవిడ్ టెస్టులు చేశారు. శనివారం జీహెచ్ఎంసీ పరిధిలోనే 1,572 కరోనా కేసులు నమోదు కాగా రంగారెడ్డిలో 92, మేడ్చల్ లో 53, సంగారెడ్డి 8, కరీంనగర్ 18, మహబూబ్ నగర్ 5, గద్వాల్ 2, రాజన్న సిరిసిల్ల 3, ఖమ్మం 7, నల్గొండ 10, సిద్దిపేట 5, వరంగల్ రూరల్ 6, జగిత్యాల 5, నిర్మల్ 1, నిజామాబాద్ 17, వరంగల్ అర్బన్ 31, భద్రాది కొత్తగూడెం 3, వికారాబాద్ 3, భువనగిరి 1, జయశంకర్ భూపాలపల్లి 4, జనగాం 3, మెదక్ లో 1 కేసు నమోదు అయ్యింది.