ప్లాస్మా డోనేట్ చేయండి...తెలంగాణ గవర్నర్ పిలుపు


సనత్ నగర్ ఇఎస్ఐ బ్లడ్ బ్యాంకును సందర్శించిన  గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ట్రెసింగ్...టెస్టింగ్....ట్రీట్మెంట్ జరగాలని అన్నారు. అలాగే ప్లాస్మా డోనేట్ చేయండని ఆమె కరోనా వచ్చి నయం అయిన వారికి విజ్ఞప్తి చేశారు. ప్లాస్మా డోనర్స్ ఇఎస్ఐ ఆస్పత్రిలో సమాచారం ఇవ్వాలన్న ఆమె రోగనిరోధక శక్తి పెంచుకోవాలని అన్నారు. తెలంగాణ లో కరోనాతో ఎవరు చనిపోవద్దనేదే తన లక్ద్యం అన్నారు. అలాగే ప్లాస్మా డోనేట్ చేసిన వారిని అభినందించిన గవర్నర్ బయట         పెయిన్ ఫుల్ సిచువేషన్ ఉందని అన్నారు. ప్లాస్మా డోనేట్ చేసే వాళ్ళను ప్రోత్సహించాలన్న ఆమె ఐసిఎంఆర్, రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్మా బ్యాంక్ కి సహకరించాలని అన్నారు. 


ఎవారికైనా కరోనా లక్షణాలు ఉంటే వెంటనే పరీక్ష చేయించుకొండని కోరారు. ప్లాస్మా థెరపీ ద్వారా సీరియస్ గా ఉన్న కరోనా బాధితులను రక్షించవచ్చని, ఇఎస్ఐ హాస్పిటల్ లో ప్లాస్మా థెరపీకి సంబంధించిన అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయని అన్నారు. కరోనా పాజిటివ్ వచ్చి తగ్గిన వారు ప్లాస్మాను దానం చేయాల్సిందిగా కోరుతున్నానని అన్నారు. తెలంగాణ ప్రజలందరూ ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటించాలని కూడా ఆమె కోరారు.