హైదరాబాద్: తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తుండగా....మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి.
వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల మేరకు...జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో.....తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల ప్రభావం, ఉపరితల ఆవర్తనం నేపథ్యంలో.... భారీ వర్షాలు కురువనున్నట్లు అధికారులు తెలిపారు.