కరోనా పరిస్థితులపై హోంమంత్రి సమీక్ష


హైదరాబాద్: పోలీస్ శాఖలో కరోనా వైరస్ పరిస్థితులపై పోలీస్ అధికారులతో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చర్చించారు. రాష్ట్రంలోని పోలీస్ కమిషనర్లతో పాటు పోలీస్ ఉన్నతాధికారులతో హోంమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ శాఖలో కరోనా బారిన పడిన సిబ్బంది గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా హోంమంత్రి పోలీస్ అధికారులతో మాట్లాడుతూ వైరస్ బారిన పడిన సిబ్బందికి మనోధైర్యం కలిగేలా అధికారులు ప్రోత్సహించాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా వ్యాధి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలియజేశారు. కరోనా రోగుల పట్ల, వారిని ఆస్పత్రికి తరలించే విషయంలో పోలీస్ సిబ్బంది వ్యవహరించాల్సిన తీరుపై హోంమంత్రి అధికారులతో చర్చించారు.


వ్యాధి పట్ల ప్రజలను అప్రమత్తం చేయడంలో పోలీస్ సిబ్బంది చేస్తున్న కృషిని హోంమంత్రి మహమూద్ అలీ అభినందించారు.