పెట్టుబడి పెట్టలేక ఇబ్బందులు పడుతోన్న రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని... రైతుబంధు పథకానన్ని తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు... అయితే, కొందరికి రైతు బంధు అందడంలేదు...బ్యాంకుకు సంబంధించి వివరాలు సరిగా లేకపోవడం....ఇతర సాంకేతిక సమస్యలతో కూడా కొన్ని సార్లు ఇబ్బందులు వస్తున్నాయి...వ్యవసాయ అధికారులకు పిర్యాదు చేసినా కొన్నిసార్లు...సమస్య పరిష్కారం కావడంలేదు... వీటికి చెక్ పెట్టేందుకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం.... రైతు బందుకు సంబంధించిన ఫిర్యాదుల కోసం గ్రేవీన్స్ సెల్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు వ్యవసాయ శాఖ కమిషనర్ జనార్దన్ రెడ్డి.. ఇప్పటి వరకు 56,94, 185 మంది రైతుల ఖాతాల్లో 7,183.67 కోట్ల రూపాయలు జమ చేసినట్టు ప్రకటనలో పేర్కొన్న వ్యవసాయ శాఖ కమిషనర్ తమ బ్యాంకు ఖాతా నంబర్లను నమోదు చేసుకొని రైతులు ఈ నెల 5వ తేదీ లోపు నమోదు చేసుకోవాలని సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 34,860 మంది రైతుల బ్యాంకు ఖాతా నంబర్లు సరిగా లేకపోవడంతో... ఖాతాల్లో డబ్బులు జమకాలేదని తెలిపారు. కాగా, ప్రతి రైతుకు రైతుబంధు పథకం వర్తింపజేస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.