తెలంగాణ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 45 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 1296 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల ఆరుగురు చనిపోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 45076 కి పెరిగింది. ఇప్పట్టివరకు రాష్ట్రంలో 32,438 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా డిశ్చార్జ్ రేటు అత్యధికంగా ఉంది. ఇదొక్కటే ఊరట అని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,224 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం......జీహెచ్ఎంసీలో 557 కరోనా కేసులు వచ్చాయి. వరంగల్ అర్బన్ 117, రంగారెడ్డిలో 111 కేసులు నమోదయ్యాయి.
తెలంగాణ లో ఇప్పటివరకు 2,65,219 కరోనా శాంపిల్స్ టెస్ట్ చేశారు.
గడచిన 24 గంటల్లో 12,519 శాంపిల్స్ టెస్ట్ చేశారు. ఇక బెడ్స్ విషయానికి వస్తే రాష్ట్రంలో 17,081 బెడ్స్ అందుబాటులో ఉంచింది ప్రభుత్వం. ఇందులో 1900 బెడ్స్ ఆక్యూపై అయింది. 15,181 బెడ్స్ ఇంకా ఖాళీగా ఉన్నాయి.