వెల్లడించిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ
హైదరాబాద్: తెలంగాణ లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. ఇవాళ కొత్తగా 1,178 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 736, రంగారెడ్డి లో 125, మేడ్చల్ లో 101 కేసులు....ఇతర ప్రాంతాల్లో మిగిలిన కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33,402 కి చేరింది.
గడచిన 24 గంటల్లో 11,062 పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇవాళ మరో 9 మంది ప్రాణాలు విడువగా....మొత్తం ఇప్పటి వరకు కరోనాతో 348 మంది మృతి చెందారు. కరోనా నుంచి ఇవాళ 1,714 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 12,125 మంది చికిత్స పొందుతుండగా....20,919 మంది కోలుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.