తెలంగాణ లో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ లో కరోనా కేసుల సంఖ్య 20 వేలు దాటిపోయింది. ఇక గడచిన 24 గంటల్లో తెలంగాణ లో 1892 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ లో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20, 462 కి చేరింది. ఇందులో 9984 కేసులు యాక్టివ్ గా ఉండగా, 10195 మంది ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయ్యారు.
ఇక గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా 8 మంది మరణించారు. దీంతో మరణాల సంఖ్య 283 కి చేరింది. ఈరోజు కొత్తగా నమోదైన 1892 కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 1658 కేసులు ఉండటం విశేషం. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతి రోజు భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.