తెలంగాణ లో కొత్తగా 1924 కరోనా కేసులు


తెలంగాణ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకీ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1924 కేసులు నమోదు కాగా....11 మంది మరణించారు. ఇక కొత్తగా 992 మంది కొలుకున్నారని బులిటెన్ విడుదల చేసింది ఆరోగ్య శాఖ. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 29536 కి చేరింది. ఇందులో 17 వేల 279 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. 


ఇక ప్రస్తుతం 11వేల 933 యాక్టీవ్ కేసులున్నాయి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 324 మంది కరోనాతో చనిపోయారు.