17 వ శతాబ్దంలో ఇటలీకి చెందిన గ్యులియా తొఫానా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నసమయం! ఈమె కస్టమర్లంతా పెద్ద పెద్ద ఫ్యామిలీల నుండి వచ్చే మహిళలు.. బయటికి మేకప్ చేసే ఆమెగా మాత్రమే పరిచయం ఉన్న ఈమె లోపల మాత్రం విషాన్ని తయారు చేసేది…ఆమె తయారు చేసే విషానికి విపరీతమైన డిమాండ్ ఉండేది. తమ భర్తలను చంపడానికి …పెద్ద పెద్ద కుటుంబాల మహిళలు ఈమె దగ్గరి నుండి విషాన్ని తీసుకెళ్లి తమ భర్తలను మట్టుబెట్టేవారు.
ఎందుకిలా?
17 వ శతాబ్దంలో… ఎక్కువగా బలవంతపు పెళ్లిళ్లు జరిగేవి., ఒకసారి పెళ్లైతే విడిపోయే ఛాన్స్ ఉండేది కాదు…దీంతో భర్తతో సంసారం చేయడం ఇష్టంలేని మహిళలు వారిని వదిలించుకోడానికి ఒక్కటే మార్గం వారిని చంపడం… ఫిజికల్ గా వాళ్లను చంపలేరు అందుకే ఈమె ఇచ్చే విషంతో వారిని చంపేసి..స్వేచ్ఛగా బతికేవారు.!
హిస్టరీ
ఈమె ఇచ్చిన పాయిజన్ కారణంగా సుమారు 600 మంది చంపబడ్డారు. ఈ విషం ఎంత పవర్ ఫుల్ అంటే …పాలలో కేవలం నాలుగు చుక్కలు కలిపితే చాలు రక్తం కక్కుకొని చనిపోయేవాళ్లు
ముగింపు
ఈమె వ్యాపారం గురించి బయటపడడంతో…. ఈమెను , ఈమె కూతుర్ని వీరికి సహాయం చేసిన మరో ముగ్గుర్ని ఉరి తీశారు.