హైదరాబాద్: తెలంగాణ లో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో ( ఈ రోజు సాయంత్రం ఐదు వరకు ) రాష్ట్ర వ్యాప్తంగా 1,550 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య 36,221 కి చేరింది. గత 24 గంటల్లో 11,525 పరీక్షలు చేయగా....ఇప్పటివరకు 1,81,849 పరీక్షలు చేశారు. ప్రస్తుతం 12,178 మంది వైద్యం పొందుతున్నారు. ఇప్పటివరకు 23, 679 మంది డిశ్చార్జ్ అవ్వగా...ఈ రోజు డిశ్చార్జ్ అయినవారు 1,197 కోవిడితో రాష్ట్రంలో ఈ రోజు తొమ్మిది మంది చనిపోయారు. మొత్తంగా 365 మంది మృతి చెందారు.
ఈ రోజు నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 926 కేసులు నమోదయ్యాయి. ఇక రంగారెడ్డి జిల్లా నుంచి 212, మేడ్చల్ నుంచి 53 కేసులు నమోదయ్యాయి.