తెలంగాణ లో కొత్తగా మరో 1018 కరోనా పాజిటివ్ కేసులు


తెలంగాణ లో కరోనా స్వైరవిహారం చేస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. బుధవారం ఒక్కరోజే 1018 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క హైదరాబాద్ లోనే 881 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య ఇప్పటివరకు 17,357 కు చేరింది. 


ఇక కరోనా మహమ్మారి భారిన పడి గడచిన 24 గంటల్లో ఏడుగురు మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో 267 మంది మృతి చెందారు.


తెలంగాణ లో ప్రస్తుతం 9008 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. బుధవారం 788 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం ఇప్పటివరకు 8082 మంది కరోనా బారి నుండి కోలుకున్నారు.