తెలంగాణ లో కొత్తగా 1,590 కరోనా కేసులు.....ఒక్క హైదరాబాద్ లోనే....


హైదరాబాద్: తెలంగాణ లో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య ఎంతకీ తగ్గడంలేదు. దీంతో రోజు రోజుకు కరోనా తీవ్రత పెరుగుతూ విజృంభిస్తోంది. దీంతో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ఆదివారం 1,590 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఏడుగురు మృతి చెందారు. ఇప్పటివరకు అన్ని జిల్లాల్లో 23,902 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మొత్తం 295 మంది కరోనాతో చనిపోయారు. కరోనా సోకి చికిత్స పొంది 1,166 మంది డిశ్చార్జ్ కాగా ఇప్పటివరకూ 15, 703 మంది డిశ్చార్జ్ అయ్యారు. 


జీహెచ్ఎంసీ పరిధిలోనే 1,277 మందికి పాజిటివ్ రాగా మేడ్చల్ జిల్లాలో 125, రంగారెడ్డి జిల్లాలో 82, సూర్యాపేటలో 23, సంగారెడ్డిలో 19, మహబూబ్ నగర్ లో 19, నల్గొండలో 14, కరీంనగర్ లో 4, వనపర్తి లో 4, మెదక్ లో 3, నిజామాబాద్ 3, భద్రాది కొత్తగూడెం లో 2, జనగంలో 2, నిర్మాల్ లో 2, వికారాబాద్ లో 2, వరంగల్ రూరల్ లో 1, సిద్దిపేటలో 1, గద్వాల్ లో 1, రాజన్న సిరిసిల్లలో 1, ఆదిలాబాద్ లో 1, ఖమ్మంలో 1, యాదాద్రి లో 1, పెద్దపల్లిలో 1, నారాయణపేట్ లో ఒక్క కరోనా కేసు నమోదు అయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్  బులిటెన్ ను విడుదల చేసింది.