సోమవారం నుంచి జాగ్రత్త సుమా... ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం సలహా.....


* కేంద్రం మార్గదర్శకాలను అనుసరించి గైడ్ లైన్స్
* మొత్తం 40 అంశాలతో సలహా సూచనలు
* జీవో నంబర్ 75 విడుదల


సోమవారం నుంచి మరిన్ని లాక్ డౌన్ నిబంధనలు తొలగిపోనున్న వేళ, ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కొన్ని సూచనలు ఇచ్చింది. మొత్తం 40 అంశాలను పొందుపరుస్తూ, సవివరమైన సలహా సూచనలు విడుదల చేస్తూ, జీవో నంబర్ 75ను జారీ చేసింది.


హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్, దేవాలయాల్లో శానిటైజర్లు, ధర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరని, వెళ్లి వచ్చేందుకు మార్గాలు వేర్వేరుగా ఉండాలని, లిఫ్టుల్లో ఎక్కువ మంది వెళ్లే వీలు లేదని పేర్కొంది. హోటల్ కు వచ్చే అతిథుల వివరాలతో పాటు, వారి ఆరోగ్య పరిస్థితిపై స్వీయ ధ్రువీకరణ తీసుకోవాలని, రెస్టారెంట్లలో టేబుల్స్ మధ్య భౌతిక దూరం ఉండేలా జాగ్రత్త పడాలని, ఏసీ 24 నుంచి 30 డిగ్రీల మధ్య ఉంచాలని, మాల్స్ లో చిన్నారులు ఆడుకునే స్థలాలను తెరవరాదని ఆదేశించింది. రెస్టారెంట్లు మొత్తం సీటింగ్ లో 50 శాతం మందినే అనుమతించాలని, అక్కడే తినకుండా, ఇంటికి తీసుకెళ్లే వారిని ప్రోత్సహించాలని సూచించింది.


ఇక కంటైన్ మెంట్ జోన్లలో కఠిన నిబంధనలు అమలవుతాయని, ఇక్కడి వారెవరూ కార్యాలయాలకు వెళ్లరాదని, ఇంటి నుంచి పనిచేస్తున్న వారిని ప్రోత్సహిస్తూ, దాన్ని సెలవుగా ఎట్టి పరిస్థితుల్లోనూ యాజమాన్యాలు పరిగణించరాదని ప్రభుత్వం ఆదేశించింది. పనివేళలు దశలవారీగా ఉంచేలా చూడాలని, వాహనాలను సోడియం హైపోక్లోరైడ్ తో నిత్యమూ శుభ్రపరచుకోవాలని సూచించింది.


ఏదైనా ఆఫీసులో ఒకటి లేదా రెండు కేసులు వస్తే, వారు అంతకుముందు రెండు రోజుల పాటు తిరిగిన ప్రాంతాన్ని శానిటైజ్ చేస్తే సరిపోతుందని, అంతకుమించి కేసులు వస్తే మాత్రం ఆ భవనాన్ని రెండు రోజులు మూసేయాలని, అప్పటి వరకూ ఎవరినీ అనుమతించ రాదని ఆదేశించింది.


తెలంగాణ హోం క్వారంటైన్ న్యూగైడ్‌లైన్స్‌... ఇంట్లో ఇలా ఉండాలి ...


తెలంగాణ సర్కార్ తాజాగా హోంక్వారంటైన్ గైడ్‌లైన్స్‌ని విడుదల చేసింది. 
ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.హోం క్వారంటైన్‌లో 
ఉండే వారికి పలు సూచనలు చేసింది
ప్రభుత్వం. 
హోం క్వారంటైన్లో ఉన్న వాళ్లు, ఇల్లంతా తిరుగుతూ తమ కుటుంబ సభ్యులకూ వైరస్ అంటిస్తారు. 
ఈ నేపథ్యంలో క్వారంటైన్‌లో ఉన్నవాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలంగాణ వైద్యారోగ్య శాఖ కొన్ని కొత్త గైడ్‌లైన్స్ విడుదల చేసింది.


 హోం క్వారంటైన్‌లో ఎలాఉండాలి..? 


1. ఇతర దేశాల నుంచి, ప్రాంతాల నుంచి వచ్చిన వారు పాజిటివ్ పేషంట్లతో కాంటాక్ట్ అయిన వాళ్లు హోంక్వారంటైన్‌లో ఉండాలి.
వారికి లక్షణాలు ఉన్నా లేకున్నా 
14 రోజులు ఇంట్లోనే ఉండాలి.


2. గాలి, వెలుతురు వచ్చేలా వీరు సపరేట్‌గా ఒక గదిలో ఉండాలి.
అలాగే ప్రత్యేకంగా బాత్రూమ్ కేటాయించాలి


3. క్వారంటైన్‌లో ఉంటున్న వ్యక్తి ఇంట్లో చిన్నారులు, 55 ఏళ్లు పైబడిన వృద్ధులు, గర్భిణీలు ఉండకూడదు


4. క్వారంటైన్ వ్యక్తి వాడిన బెడ్‌షీట్స్, టవల్స్ డెటాల్ వేసి నానబెట్టాలి


5. వీరికి సేవలందించడానికి ముందు.. ఆ తర్వాత 40 నుంచి 60 సెకన్ల పాటు చేతులను కడుక్కోవాలి


6.క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తి ఎప్పటికప్పుడు తనని తాను గమనించుకుంటూ ఉండాలి


7. జ్వరంతో పాటు పల్స్ రేట్ చెక్ చేసుకోవాలి. వ్యాధి లక్షణాలు కనిపిస్తే.. రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలి


8. క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తి వాడే వస్తువులను ఇతరులు తాకకూడదు


9. క్వారంటైన్‌ వ్యక్తి ఖచ్చితంగా మాస్క్ ధరించాలి. అలాగే ప్రతీ 6 నుంచి 8 గంటలకు ఒకసారి మాస్క్ మార్చాలి


10. వాడిన మాస్క్‌లు, ఇతర పారవేసే వస్తువులు కాల్చివేయాలి. లేదా గోతిలో పాతిపెట్టాలి.