అన్ని సమయాల్లో మాములు చల్లని నీరు తాగేకంటే గోరు వెచ్చని నీరు తీసుకోవడం అన్ని రకాలుగా ఉత్తమం. గోరు వెచ్చని నీళ్లు తీసుకుంటే ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. గోరు వెచ్చని నీరు తీసుకుంటే గొంతులో ఎలాంటి ఇబ్బందులు ఉన్న తొలగిపోతుంది. అయితే, ఈ గోరు వెచ్చని నీళ్లలో కొన్ని రకాల పదార్థాలు కలిపి తీసుకుంటే, రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. కరోనాను ఎదుర్కుకొనడానికి ఈ రోగ నిరోధక శక్తి ఎంతగానో పనిచేస్తుంది. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.
గఓరు వెచ్చని నీటిలో తేనే, మిరియాలపొడి, చిటికెడు పసుపు వేసుకొని తాగితే చాలా మంచిది. ఇలా తీసుకోవడం వలనా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు, జ్వరం వంటివి దరి చేరకుండా ఉంటాయి.
అంతేకాదు, ఊపిరితిత్తుల్లో శ్ళ్లేశ్మమ్ తగ్గుతుంది. ఫలితంగా శరీరం బలహీనపడకుండా ఉంటుంది.
గోరువెచ్చని నీటితో తేనే, వాము కలుపుకొని తీసుకుంటే జీర్ణ సంబంధమైన ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు. కడుపునొప్పి వంటివి తగ్గిపోతాయి. కాఫీ, టీ తాగే బదులుగా గ్రీన్ టీలో కొద్దిగా తేనే కలుపుకుని తీసుకుంటే శరీరం ఉత్తేజంగా ఉంటుంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపద్యంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఒక్కటే మార్గం కాబట్టి తప్పనిసరిగా ఇలా చేయడం మంచిది అని నిపుణులు పేర్కొన్నారు.