జీవితంలో ఇక ఈ కష్టం నుంచి పైకి రాలేనకున్నప్పుడు నాన్నకు ఫోన్ చేసి రెండు నిమిషాలు మాట్లాడినా..నిశ్శబ్దంగా ఆయన మోమువైపు కొన్ని క్షణాలు చూసినా కొండంత ధైర్యం లభిస్తుంది. అవును ఆయన గగనంలా ఎక్కడికి వెళ్లినా మనతోనే ఉంటాడు. నిరంతరం మనల్ని కాపు కాస్తూనే ఉంటాడు. అన్నీ అమ్మని అడిగి..'నాన్నా..అమ్మెక్కడ' అనే ఒకే ఒక్క ప్రశ్న అడిగినా ఆయన ఇసుమంత కూడా ఫీల్ కాడు. ఆయన మన వెనుక ఉండి నడిపిస్తూ..వెనుకే ఆగిపోయాడు. మనం ఎంత ముందుకు వెళ్లినా..ఆయన మాత్రం వెనుకే ఉండిపోతున్నాడు. బొమ్మలు కావాలని మారాం చేసినప్పటి నుంచి బ్రతుకు బండి సరిగ్గా నడవప్పటివరకు ఆయనే ఆధారం. మన రక్తంలో నాన్న. ఓటమిలో ఓదార్పు నాన్న..గెలుపులో ధైర్యం నాన్న.
బడికి వెళ్లకపోతే బాదింది నాన్న..గొప్పు కొలువు చేస్తుంటే మురిసింది నాన్న. జీవితాన్నంత బిడ్డలకే అంకితం చేసిన పిచ్చిమారాజు నాన్న. జీవితాన్నే ఇచ్చిన నాన్నకి ఓ రోజు ఇచ్చాం..ఎంతైనా గొప్పవాళ్లం. అదీ లేకపోతే ఆ రోజు కూడా ఆయన్ని పట్టించుకోని వెర్రిబాగులోళ్లం.
నాన్న కష్టానికి ప్రతిఫలం ఇచ్చే బిడ్డలు ఉండటం గొప్ప విషయం. ఆయన్ని వంతులు వేసి పంచుకునేంత దిగజారిపోవడం అత్యంత బాధాకరం. చిన్నప్పుడు నిన్ను ఆయన భుజం మీద మోసిన ఙ్ఞాపకాలు గుర్తు తెచ్చుకో…గుండె బరువుతో మనసారా ఒక్కసారి నాన్నని కౌగిలించుకో. ధర్మఘంట పాఠకులకు ఫాథర్స్ డే శుభాకాంక్షలు.
జీవితంలో ప్రతీ ఒక్కరికి ..అది కొడుకైనా కూతురైనా …తండ్రే హీరో. అన్ని నేర్పించేది…సరైన మార్గంలో నడిపించేది కన్న తండ్రి మాత్రమే. తల్లి తండ్రుల కి తమ బిడ్డల మీద ఉండేది వెలకట్టలేని ప్రేమ. ఈ ప్రేమని డబ్బుతో కొనలేము..మాటల్లో చెప్పలేము. అదొక అందమైన అనుభూతి… తీపి జ్ఞాపకం. ఆ అనుభూతి.. ప్రేమ తల్లి తండ్రులకి తమ పిల్లలకి మద్యనే ఉంటుంది. అబ్బాయి అయినా.. అమ్మాయి అయినా తండ్రే మొదటి గురువు..మొదటి స్నేహితుడు. అలాంటి తండ్రి గురించి పట్టించుకునే సమయం ఒక వయసు వచ్చాక దాదాపు చాలా మంది కొడుకు కూతూళ్ళకి దొరకడం లేదు.
మానవీయ సంబంధాలు అంటే ఇవేనేమో. అయితే ప్రతీ ఒక్కరికి అమ్మ అయ్యాక అమ్మతనం తెలిసొస్తుంది. తండ్రి అయ్యాక తండ్రి ఎంత గొప్పవారో తన పిల్ల కోసం ఎన్నో వదులుకొని ఉంటారో.. ఎన్ని త్యాగాలు చేసి ఉంటారో తెలిసొస్తుంది. ప్రపంచంలో తారతమ్యం లేనిది ఇంకెవరి దగ్గర దొరకనిది అంటే అది తల్లి తండ్రుల ప్రేమ ఒక్కటే. సామాన్యుడి నుంచి సినీ రాజకీయ ..పెద్ద పెద్ద వ్యాపారస్థుల వరకు తండ్రి అంటే హీరో అంతే. తన పిల్లకోసం నిరంతరం తాపత్రయపడుతూ ఎన్నో కష్టాలను అనుభవిస్తూ పిల్లల ముందు మాత్రం చిరు నవ్వుతో కనిపిస్తారు. ప్రతీ ఒక్కరి జీవితంలో ఒక ఎమోషనల్ జర్నీ ఏదైనా ఉంటుందంటే అది తండ్రీ పిల్ల మద్య సాగే అందమైన జీవిత ప్రయాణమే. కాని ఈ ప్రయాణాన్ని ఎంతో మంది మిస్ అవుతున్నారు.
అంతర్జాతీయ పితృ వందన దినోత్సవము (Father's Day) ను ప్రతి సంవత్సరం జూన్ నెలలోని మూడవ ఆదివారం నాడు జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా 52 దేశాలు తండ్రుల గౌరవార్థం ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నాయి. తల్లుల గౌరవార్థంగా మాతృ వందన దినోత్సవం ఉండగా బాధ్యతకు మారు పేరుగా నిలిచే నాన్నలకు కూడా ఒక రోజును కేటాయించాలని అమెరికాకు చెందిన సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ ఆలోచించి ప్రచారం మొదలు పెట్టింది. ఆమె ఆలోచనలకు ప్రతిరూపంగా 1910లో మొదటిసారి ఫాదర్స్ డే ను గుర్తించి జరుపుకున్నారు.
ఆ తరువాత అలా అలా ఈ నాన్నల వందన దినోత్సవమునకు ఆదరణ పెరుగుతూ వచ్చింది. ప్రపంచ దేశాలు 1972 నుంచి ప్రతి సంవత్సరం జూన్ లో వచ్చే మూడో ఆదివారాన్ని పితృ వందన దినోత్సవముగా ప్రకటించుకొని జరుపుకుంటున్నాయి.
అయితే, స్మార్ట్ డాడ్ ఆలోచన వెనుక చాలా కథే ఉంది. డాడ్ అర్కన్‌సాస్ అనే ప్రాంతంలో జన్మించారు. ఆమె తండ్రి విలియం జాక్సన్ స్మార్ట్. ఆయన సైన్యంలో పనిచేసేవారు. ఆయనకు ఆరుగురు పిల్లలు పుట్టారు. అనారోగ్య కారణంగా ఆయన భార్య మృతి చెందారు. అయినప్పటికీ.. పిల్లలకు ఎలాంటి లోటూ లేకుండా.. విలియం పోషించారు. వారి బాగోగులు అన్నీ కూడా ఆయనే చూసుకున్నారు.
ఒక పక్కసైన్యంలో విధులు నిర్వహిస్తూనే.. మరోపక్క, పిల్లలను క్రమశిక్షణతో పెంచి పెద్ద చేశారు. ఈ నేపథ్యంలోనే విలియం కుమార్తె డాడ్ తన తండ్రికి గుర్తుండిపోయేలా కానుక ఇవ్వాలనుకున్నారు. ఈ క్రమంలోనే జూన్ మూడో ఆదివారం, 1910లో ఆమె తన తండ్రికి పితృ వందన దినోత్సవం నిర్వహించారు. అప్పటి నుంచి ఇది అమెరికా సహా ప్రపంచ దేశాల్లో పాటించడం ప్రారంభమైంది. అమెరికా, బ్రిటన్‌లలో ఈ రోజును అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. మన దేశంలో గడిచిన దశాబ్ద కాలంగా దీనిని నిర్వహిస్తున్నారు.
నిజానికి మన భారతీయ సంప్రదాయం ప్రకారం.. నిత్యం పితృ వందనపూజ ఉంది. మాతృదేవో భవ, పితృదేవో భవ అంటూ.. నిత్యమూ వారిని స్మరించుకోవడం భారతీయ సంప్రదాయంగా వస్తోంది. అయినప్పటికీ.. నేటి డిజిటల్ ప్రపంచంలో అంతా ఒక్కటైన నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి మంచి కార్యక్రమం జరిగినా.. అందరూ ఫాలో అవుతున్నారు.
ఒక్కరోజు స్మరణతో పోయే బంధం కాదది. ఒకే రోజు తలుచుకుని చెప్పుకునే అనుబంధం కాదది. ఊపిరి తీసుకున్న క్షణం నుంచి.. జీవితపు చివరి అంచుల వరకూ అన్నిదశాల్లోనూ ప్రభావితం చేసే శక్తి అది. నాన్న.. రెండక్షరాలు.. కానీ ఆ శబ్దం ఇచ్చే అనుభూతి ప్రతి తండ్రికి ఓ మధురస్మృతి. ప్రతి తయునికి జీవిత కాలపు పెన్నిధి. ఫాదర్స్ డే 2020 సందర్భంగా అందరికీ శుభాకాంక్షల అక్షరాల మాల వేస్తోంది ఇండియా ప్రజాబంధు పార్టీ .
తన జీవితాన్ని త్యాగం చేసే ప్రతి కొడుకు, కూతురు జీవితంలో నాన్న పాత్ర మరువలేనిదని ఇండియా ప్రజాబంధు పార్టీ వ్యవస్థాపక, జాతీయ అధ్యక్షులు 'దేశభక్త' డా౹౹ అద్దంకి స్వామిదాస్ రంజిత్ ఓఫీర్ అన్నారు. అంతర్జాతీయ పితృ దినోత్సవ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మహనీయమైన... నాన్న ఎప్పుడూ పిల్లల గుండెల్లో ఉంటాడు. అదే మనం నాన్నకు ఇచ్చే గౌరవం. పిల్లలను ఎవరినైనా మీ ఇంట్లో నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం అని అడిగితే చాలా మంది పిల్లల నుంచి వచ్చే సమాధానం "నాన్న".... నాకు మానాన్న అంటే చాలా ఇష్టం అని చెపుతారు. మరికొంత మంది నాకు మా అమ్మ అంటే ఇష్టం అని చెపుతుంటారు. అమ్మ 9 నెలలు మనల్ని తన కడుపులో మోసి కంటుంది. అదే నాన్న పిల్లలు పుట్టిన నాటి నుంచి వారి భవిష్యత్తుకోసం ఆలోచిస్తారు. పిల్లల్ని జీవితంలో ఎదిగేవరకూ మోస్తూనే ఉంటారు. ప్రతి క్షణం పిల్లలు చేసే తప్పును సరిదిద్దుకుంటూ వారిని మంచి మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తారు. అది తన బాధ్యతగా ఫీల్ అవుతాడని, అసలు పిల్లలకు ఎదగడం అంటేకూడా ఏంటో తెలియని చిన్నతనం నుంచే పిల్లలు వేసే తప్పటడుగులను సరిదిద్దుతూ ఉంటారు. ఆ సమయంలో పిల్లలకు నాన్న అంటే కోపం వచ్చినా అది కాసేపే ఉంటుంది. మళ్లీ నాన్న దగ్గరికే వెలుతుంటారు. తండ్రి కూతురి విషయంలో కాస్త శాంతంగా ఉన్నప్పటికీ కొడుకుల విషయంలో కాస్త కఠినంగానే ప్రవర్తిస్తారు. ఎందుకంటే ఓ తండ్రి కూతురిని తన తల్లిలా భావిస్తారు. కొడుకు విషయంలో కూడా తండ్రి బాధ్యత నేర్పాలి అనుకుంటారు. కొడుకులు సమాజంలో ఎలా మెదలాలి, ఎదగాలో నేర్పిస్తాడు. అది కొడుకు ఎదుగుదల కొరకేనని, ఎంతకష్టమైనా తానే భరించాలనుకుంటాడని, అందుకే నాన్న ఇంటికి మూలస్తంభమని, నాన్నలందరికి శుభాకాంక్షలు తెలిపారు.
నాన్న తన పిల్లల నుంచి ఆశించేది డబ్బు కాదు.. ఆస్తులు కాదు.. అంతస్తులు కాదు.. కాసింత ప్రేమ మాత్రమేనని భారతీయ మాజీ సైనికులు, ఇండియా ప్రజాబంధు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నోబుల్ రుంజాల అన్నారు. నేటి అంతర్జాతీయ పితృ దినోత్సవ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... ఇప్పటికీ.. ఎప్పటికీ.... పిల్లలు పుట్టిన నాటి నుంచి ప్రతి క్షణం పిల్లలతో ఎప్పుడూ ఉండకపోవచ్చు కానీ ఎప్పుడూ పిల్లల మంచినే "నాన్న" కోరుతారని, తన రక్తం పంచుకుని పుట్టిన పిల్లలని ఎంతగానో ప్రేమిస్తాడని, కొడుకైనా, కూతురైనా మంచి పేరు తెచ్చుకోవాలనే చూస్తారని, నాన్న లేకపోతే పిల్లలకు వాళ్ల జీవితమే లేదు. అలాంటి పిల్లలు ఎదికి ఒక స్ధాయిలో ఉన్నారు అంటే అది కూడా కేవలం తండ్రి చలవేనని, అందుకే ఏమిచ్చినా తండ్రి తన పిల్లలకు ఇచ్చిందాన్ని తీర్చుకోలేమని, అటువంటి నాన్నకు ఒక రోజు సరిపోదని, సంవత్సరం మొత్తం నాన్న రోజులే ఉండాలని, నాకున్న బెస్ట్ ఫ్రెండ్, గురువు మా నాన్నే అయినందుకు ఆయనకు కృతజ్ఞతలని, నాన్నలందరికి శుభాకాంక్షలు చెప్పి, నాన్నకు వందనం... అభివందనం..... అన్నారు.
డిసిప్లీనరీ యాక్షన్ చైర్మన్ నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మద్దెల అరుణ్ కుమార్, ఉపాధ్యక్షులు తాడెం రాజ్ ప్రకాష్, భీమేష్ కూడెల్లి, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కాశీ సతీష్, మహిళా బంధు రాష్ట్ర కార్యదర్శి శైలజ, ఎమ్మెల్యే అభ్యర్థి భారతి తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు నాన్నలందరికి శుభాకాంక్షలు తెలిపారు.
ఫాదర్స్ డే సందర్భంగా సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడలు తదితర రంగాలకు చెందిన ప్రముఖులు తమ తండ్రులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఆ సంగతులను అభిమానులతో పంచుకుంటున్నారు.
ఈ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ తన తండ్రి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. నాన్న పని ముగించుకుని ఇంటికి రావడం, ఉదయాన్నే తిరిగి పనికి వెళ్లడమే ఎక్కువగా చూశాను. మధ్యలో నాతో గడిపిన కొద్దిపాటి సమయంలో ఎంతో ప్రేమ చూపేవారు. నాకున్న బెస్ట్ ఫ్రెండ్, గురువు మా నాన్నే అయినందుకు ఆయనకు కృతజ్ఞతలు' అంటూ ట్వీట్ చేశారు