ఐజ్వాల్: ఈశాన్య భారతంలో భూకంపం సంభవించింది. మిజోరం, మేఘాలయ, మణిపూర్ లో సాయంత్రం 4 గంటల 16 నిమిషాలకు భూ ప్రకంపనలు వచ్చాయి. ఐజ్వాల్ కు 25 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని గుర్తించారు. రిక్టర్ స్కెలుపై తీవ్రత 5.1 గా నమోదైంది.
మిజోరంలో రెండ్రోజుల క్రితమే 5 తీవ్రతలో భూకంపం వచ్చింది. 48 గంటల్లోనే మళ్ళీ భూకంపం సంభవించడంతో స్థానికులు ఆందోళన ఉన్నారు.