నింగికేగిన నక్షత్రం, దివంగత కల్నల్ సంతోష్ బాబుకు ఐపిబిపి శ్రద్ధాంజలి


 - కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం - ఓదార్పు


- తల్లిదండ్రులను పరామర్శించి, చిత్రపటానికి నివాళులర్పించిన ఇండియా  ప్రజా బంధు పార్టీ వ్యవస్థాపక, జాతీయ అధ్యక్షులు, దేశభక్త డా. అద్దంకి స్వామిదాస్ రంజిత్ ఓఫీర్ 


 సూర్యాపేట: భారతదేశ సరిహద్దు లద్దఖ్‌ సమీపంలోని గాల్వన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన దాడిలో వీర మరణం పొందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్‌బాబుకు స్వస్థలమైన సూర్యాపేట నివాసంలో ఇండియా ప్రజా బంధు పార్టీ జాతీయ అధ్యక్షులు డా. అద్డంకి రంజిత్ ఓఫీర్ దివంగత కల్నల్ చిత్రపటానికి నేడు పూలమాలలు వేసి నివాళులర్పించి, తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. 



ఆ వీరున్ని కన్న పుణ్యదంపతులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ దైర్యంగా ఉండాలని ఓదార్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి, రాష్ట్రపతికి మెమోరాండాన్ని వ్రాస్తామని, సంతోష్ బాబు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.  సంతోష్ బాబు వీర మరణానికి తగిన విశిష్ట గౌరవాన్ని 'సేన మెడల్" త్వరలో అందజేయాలని డిమాండ్ చేశారు. దేశం కోసం ప్రాణాలొడ్డి పోరాడి అమరులైన మన సైనికుల త్యాగాల్ని విస్మరించొద్దని, ఇందుకు చైనాపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని, వారికి రావాల్సిన రాయితీలు వెంటనే అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 20 మంది వీర సైనికులను హతమార్చిన చైనాకు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు తగిన గుణపాఠం చెప్పాలని మండిపడ్డారు. భారతావనిలో నింగికేగిన నక్షత్రం కల్నల్ సంతోష్ బాబు, వారితోపాటు 20 మంది వీర సైనికుల్ని "నింగికేగిన నక్షత్రాలు" అంటూ కొనియాడారు. వారందరికీ డి ఎ లను కల్పించాలన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. 


దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని సైనికులు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించారని కొనియాడారు. దేశం వారి త్యాగాలను ఎన్నటికీ మరవదని.. యావత్‌ దేశ ప్రజలు అమరులైన సైనికులను స్మరించుకుంటారని తెలిపారు. గాల్వన్‌ ఘర్షణలో చనిపోయిన సైనికులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళి అర్పించారు.



భారతీయ మాజీ సైనికులు, ఇండియా ప్రజాబంధు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నోబుల్ రుంజాల మాట్లాడుతూ సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం పోరాడుతున్న మన సైనికుల దీక్ష మరింత దృఢతరం అవుతుందని, చైనా గానీ, మరే ఇతర దేశంగానీ భారత సార్వభౌమత్వం విషయంలో వేలు పెడితే తప్పక ప్రతిఘటించాలన్నారు. వారికి తగిన సమాధానం చెప్పాలని తెప్పారు. దేశంకోసం ప్రాణాలు అర్పించడం దేశభక్తికి నిదర్శనమని, చరిత్రలో లిఖించబడి, భవిష్య తరాలకు వీరే ఆదర్శ మవుతారని కొనియాడారు. కల్నల్‌ బిక్కుమల్ల సంతోష్‌బాబు, మరో 19 మంది వీర జవాన్ల మృతిపట్ల సంతాపం తెలిపి, శ్రద్ధాంజలి ఘటించారు


ఈ కార్యక్రమంలో జాతీయ డిసిప్లినరీ కమిటీ చైర్మన్ నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ పాలమాకుల మధు, రాష్ట్ర స్పోక్స్ పర్సన్ దైద జేమ్స్ జగదీశ్వర్, ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు తగుళ్ల జనార్దన్ యాదవ్, గోపురం కిరణ్ కుమార్, గోవర్ధన్, వెంకట్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.