చైనాతో ఉద్రిక్తతల వేళ రష్యాకు బయలుదేరిన భారత సైనికులు.... ఎందుకంటే?


న్యూఢిల్లీ: త్రివిధ దళాలకు చెందిన 75 మంది భారత సైనికులు రష్యాకు బయలుదేరారు. ఈ నెల 24 న మాస్కో రెడ్ స్క్వెర్ వద్ద జరిగే 75 వ విక్టరీ డే ఉత్సవాల్లో వీరు పాల్గొంటారు. ఇందుకోసం భారత సైనికులు కటీన శిక్షణ తీసుకున్నారు. కోవిడ్ వేళ అనేక జాగ్రత్తలు తీసుకుంటూ వీరు శిక్షణ తీసుకున్నారని సైన్యం తెలిపింది. విక్టరీ డే ఉత్సవాల్లో పాల్గొనేందుకు చైనా సైనికులు కూడా రష్యా బయలుదేరారు.


రెండో ప్రపంచ యుద్ధంలో విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని రష్యా విక్టరీ డే పరేడ్ నిర్వహిస్తుంది. మాస్కోలో జరిగే ఈ సైనిక పరేడ్ లో రష్యా మిలిటరీతో పాటు సన్నిహిత దేశాల సైనికులు కూడా పాల్గొంటారు.