కేసీఆర్ కు ఆర్మీ నుండి ప్రత్యేక ఆహ్వానం.!

 


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆర్మీ నుండి ప్రత్యేక ఆహ్వానం అందింది. గాల్వాన్ ఘటనలో దేశం కోసం ప్రాణాత్యాగం చేసిన అమరుడు సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం చేసిన సాయానికి ఆర్మీ ఫిదా అయ్యింది. దాంతో డిప్యూటీ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ ఎం.ఎస్ పవార్ కేసీఆర్ కు రెండు పేజీల లేఖ రాశారు. కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి అత్యున్నతమైన ప్యాకేజీని అందించడం ద్వారా మిగిలిన వారికి సీఎం కేసీఆర్ ఆదర్శంగా నిలిచారని అభినందించారు. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కోరుకొండ సైనిక పాఠశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించాలని కోరారు. మరోవైపు ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించారంటూ మాజీ ఎంపీ కవితను కూడా వారు అభినందించారు.


సంతోష్ బాబు కుటుంబంతో పాటు ఇతర రాష్ట్రాల అమర జావాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించడం పై హర్షం వ్యక్తం చేశారు.