దిల్లీ: తూర్పు లద్దాఖ్ లో వివాదంపై భారత్-చైనా మధ్య మరోసారి చర్చలు జరుగుతున్నట్లు సైనిక వర్గాలు తెలిపాయి. ఈరోజు ఉదయం11:30 గంటలకు ఈ సమావేశం ప్రారంభమైనట్లు సమాచారం. గాల్వాన్ లోయ తమదేనంటూ చైనా బుకాయించడంతో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ఇరు వర్గాల మధ్య దాడుల తర్వాత ఈ నెల 6న చివారిసారి మేజర్ జనరల్లా స్థాయిలో చర్చలు జరిగిన విషయం తెలిసిందే. గాల్వాన్ లోయ తమదంటే తమదే అంటూ ఇరు దేశాలు వాదించుకుంటున్న నేపథ్యంలో ఈసారి కమాండర్ స్థాయిలో చర్చలు జరపాలని నిర్ణయించారు. వాస్తవాధీన రేఖ వెంట చుశుల్ ఎదురుగా చైనా వైపు ఉన్న మోల్డో ప్రాంతంలో చర్చలు జరుగుతున్నాయి. గతంలోనూ ఇదే ప్రాంతంలో ఇరు దేశాల మేజర్ జనరళ్లు సమావేశమయ్యారు.
భారత్- చైనా మధ్య మరోసారి చర్చలు