కొండపోచమ్మ కాల్వకు గండి


సిద్దిపేట: కొండపోచమ్మ జలాశయం కాల్వకు గండి పడింది. ఇటీవలే కొండపోచమ్మ జలాశయం నుంచి ఆలేరు నియోజకవర్గనికి నీరు విడుదల చేసారు. ఈక్రమంలో మంగళవారం ఉదయం 7 గంటలకు మర్కుక్ మండల శివారు వెంకటాపూరం వద్ద కొండపోచమ్మ సాగర్ కుడి కాలువకు గండి పడింది. దీంతో గ్రామంలోకి భారీగా వరదనీరు ప్రవహించింది. పంట పొలాలు, కూరగాయల తోటలు ముంపునకు గురయ్యాయి. ఉదయం పూట కావడంతో ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు. అధికారులకు సమాచారం అందించడంతో కాలువకు నీటివిడుదల నిలిపివేశారు.