ప్రచారం సాగుతోంది... ఇదే సమయంలో... లాక్ డౌన్ విధిస్తే ఏంటి పరిస్థితి... ఎలా అమలు చేయాలన్న దానిపై అధికారులను సీఎం కేసీఆర్ వివరాలు అడిగారు... జులై 3వ తేదీ నుంచి లాక్ డౌన్ విధించాలని ప్రభుత్వం భావిస్తుండగా... దీనిపై రేపు అధికారికంగా ప్రకటన రానుంది. అయితే... గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లాక్ డౌన్ అంశంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ అమలు...కరోనా కట్టడికి పరిష్కారం కాదన్న ఆమె.. మళ్ళీ లాక్ డౌన్ పెడితే చిన్న కుటుంబాలు మరింత చితికి పోతాయని అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్ రాజేంద్రనగర్ లో మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి సబితారెడ్డి హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. జాగ్రత్తలు తీసుకుంటూ... కరోనాని కట్టడి చేద్దామని పిలుపునిచ్చారు మంత్రి సబితాఇంద్రారెడ్డి.