తెలంగాణ లో తగ్గని కరోనా కేసులు.....సోమవారం ఒక్క రోజే....


హైదరాబాద్: తెలంగాణ లో కొత్తగా 164 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. సోమవారం కరోనాతో తొమ్మిది మంది చనిపోయారు. హైదరాబాద్ పరిధిలో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వారి 133 కాగా, మేడ్చల్ లో ఆరుగురు, రంగారెడ్డి జిల్లాలో ఆరుగురు, సంగారెడ్డి జిల్లాలో నలుగురు, నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు, మహబూబ్ నగర్, కరీంనగర్, ములుగు జిల్లాలో ఇద్దరేసి, సిద్దిపేట, యాదాద్రి, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్, వనపర్తి జిల్లాలో ఒక్కోక్కరు చొప్పున కరోనా బారిన పడ్డారు. ఇప్పటివరకు 4484 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. 2278 మంది డిశ్చార్జ్ కాగా 2032 మంది యాక్టివ్ కేసులుగా ఉన్నారు. ఇప్పటివరకు 174 మంది కరోనాతో మృతి చెందారని తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది.