COVID-19కు మరో 2 ప్రధాన లక్షణాలను తెలిపిన కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ


కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ శనివారం మేజర్ అప్‌డేట్ ఇచ్చింది. COVID-19కు మరో 2 ప్రధాన లక్షణాలను వెల్లడించింది. ముందుగా సూచించిన 6లక్షణాలే కాకుండా ఇవి ఉన్నా కరోనాగా అనుమానించవచ్చని నిర్ధారించింది. చాలా కేసుల్లో శ్వాస సంబంధిత సమస్యలే వస్తాయని ఈ లక్షణాలు తక్కువ కనిపిస్తాయని పేర్కొంది.


ఇతర లక్షణాలు:


> జ్వరం


> దగ్గు


> నీరసం


> శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది


> కఫ్ఫం ఎక్కువగా రావడం


> ముక్కు కారుతుండటం


> విరేచనాలు


వీటితో పాటుగా అనోస్మియా, అగేసియా వాసన, రుచి తెలియకపోవడం వంటివి కూడా అదే లిస్టులో చేర్చింది ఆరోగ్య శాఖ 


శనివారం ఉదయం నాటికి ఇండియాలో కరోనా కేసులు 3లక్షల 8వేల 993కు చేరాయి. వారిలో లక్షా 45వేల 779యాక్టివ్ కేసులు ఉన్నట్లు లక్షా 54వేల 330 మంది కోలుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. 8వేల 884మంది ప్రాణాలు కోల్పోయారు.


ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల్లో నాలుగో స్థానింలో నిలిచిన ఇండియా మరిన్ని జాగ్రత్తలు తీసుకుని కరోనా వ్యాప్తి అడ్డుకోవాలని చూస్తుంది. ఇతరదేశాలతో పోల్చుకుని మనం చూసుకోకూడదు. పరిస్థితులను బట్టి కేసులు పెరగడం, తగ్గడం వంటివి జరుగుతుంటాయి. కొన్నిసార్లు ఇది వేరే దారి తీయొచ్చు. మన దేశంతో పాటుగా సమానమైన జనాభా ఉన్న వాటితోనే మనం పోల్చుకోవాలి' అని లాల్ అగర్వాల్ అన్నారు.


కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ దశకు ఇంకా ఇండియా చేరుకోలేదని ICMR చీఫ్ డా.బలరాం భార్గవ అన్నారు. ఫిబ్రవరిలో మన దగ్గర ఒకటే ల్యాబ్ ఉంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా 850ల్యాబులు ఉన్నాయి. మొత్తం 52లక్షల 13వేల 140శాంపుళ్లను టెస్టు చేశారు. గడిచిన 24గంటల్లో లక్షా 51వేల 808శాంపుల్స్ నమోదైయ్యాయి. దీనిని బట్టి చూస్తే ఇండియా రోజుకు 2లక్షల కేసులకు టెస్టులు చేయొచ్చని అన్నారు.