రష్యాలో ఘనంగా జరిగిన రెండో ప్రపంచ యుద్ధ వేడుకలు


రెండో ప్రపంచ యుద్ధ వేడుకలు రష్యాలో ఘనంగా జరిగాయి. సెకండ్ వరల్డ్ వార్ లో జర్మనీని ఓడించిన సందర్భాన్ని పురస్కరించుకుని మాస్కోలో ఉత్సవాలు నిర్వహించారు. రెడ్ స్క్వెర్ లో జరిగిన 75వ విజయోత్సవ పరేడ్ ను రష్యా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ వేడుకల్లో రష్యా ఆయుధ సంపత్తిని ప్రదర్శించారు. సైనికుల కవాతు ప్రేక్షకులను కట్టిపడేసింది. యుద్ధ ట్యాంకులు కదం తొక్కాయి.వైమానిక దళం అద్భుత ప్రదర్శనతో మెస్మరైజ్ చేసింది.


రష్యా విజయోత్సవ వేడుకల్లో భారత సైన్యం కూడా కదం తొక్కింది. త్రివిధ దళాలకు చెందిన సైనికుల బృందం రెడ్ స్క్వెర్ లో కవాతు చేసింది. ఈ వేడుకలకు మనదేశం తరపున రక్షణశాఖ మంత్రి రాజ్ నాద్ సింగ్ హాజరయ్యారు.